Sports

Brisbane Heat Crush Sydney Sixers To Win Australias Big Bash League Final


Cricket Latest News: బిగ్‌బాష్‌ లీగ్‌( Big Bash League) ట్రోఫీని బ్రిస్బేన్‌ హీట్ సొంతం చేసుకుంది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా బ్రిస్బేన్‌ హీట్స్‌ – సిడ్నీ సిక్సర్స్‌(Sydney Sixers) మధ్య  జరిగిన ఫైనల్‌లో  54 పరుగుల తేడాతో సిడ్ని సిక్సర్స్‌ను చిత్తు చేసి బ్రిస్బేన్‌ హీట్స్‌ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో తడబడ్డా బౌలింగ్‌లో ఆకట్టుకున్న ఆ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. బ్రిస్బేన్‌ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ నాలుగు వికెట్లతో బ్రిస్బేన్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌.. జాన్సన్‌ను రూ. 10 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే. జాన్సన్‌ నాలుగు వికెట్లతో చెలరేగడంతో బ్రిస్బేన్‌ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ.. 112 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బ్రిస్బేన్‌.. 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచిన సిడ్నీ బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో 41 బంతుల్లోనే సెంచరీ బాదిన జోష్‌ బ్రౌన్‌.. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 5 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు. బ్రిస్బేన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. సిడ్నీ బౌలర్లలో సీన్‌ అబాట్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో సిడ్నీ తడబడింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్‌ డానియల్‌ హ్యూగ్స్‌ (1) వికెట్‌ కోల్పోయిన ఆ జట్టు.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లను నష్టపోయింది. మోస్తారు ఛేదనలో ఆ జట్టు సరైన భాగస్వామ్యం నిర్మించకపోగా ఒక్కరంటే ఒక్క బ్యాటర్‌ కూడా అర్థ సెంచరీ చేయలేదు. 

ప్రత్యేక ఆకర్షణ వార్నరే
బిగ్‌బాష్‌ లీగ్‌ (BBL 2024) మ్యాచ్‌ కోసం ఆస్ట్రేలియా(Austrelia) స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌(David Warner) ప్రైవేట్‌ హెలికాప్టర్‌( Helicopter)లో డైరెక్ట్‌గా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ల్యాండ్‌ అవ్వడం క్రికెట్‌ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సొదరుడి వివాహానికి హాజరైన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన వార్నర్‌ నేరుగా.. తాను ఆడబోయే మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో హెలికాప్టర్‌లో హాలివుడ్‌ హీరో రేంజ్‌లో అడుగుపెట్టాడు. వార్నర్‌ కోసం బిగ్‌బాష్‌ లీగ్‌ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్‌, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాక వార్నర్‌ ఆడనున్న తొలి మ్యాచ్‌ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్‌ చీఫ్‌ ప్రకటించాడు. హంట‌ర్ హ్యలీ ప్రాంతంలో వార్నర్ సోద‌రుడి పెళ్లి ఉంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హంట‌ర్ వ్యాలీకి మ‌ధ్య 250 కిలోమీట‌ర్ల దూరం ఉంది. దాంతో, వివాహ వేడుక‌ వివాహ వేడుక‌లో పాల్గొన్న అనంత‌రం వార్నర్ ప్రైవేట్ హెలిక్యాప్టర్‌లో సిడ్నీకి బ‌య‌లుదేరాడు. ప్రేక్షకుల‌ను అనుమ‌తించ‌డానికి ముందే వార్నర్‌ స్టేడియానికి చేరుకున్నాడు. హంటర్ వ్యాలీప్రాంతంలో సోదరుడి పెళ్లి వేడుకలో పాల్గొన్న వార్నర్.. అక్కడినుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి మైదానానికి చేరుకున్నాడు.

వార్తల్లో హరీస్‌రౌఫ్‌
పాకిస్తాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ ఈసారి బిగ్‌బాష్‌లో వార్తలలో నిలిచాడు.హరీస్‌ రౌఫ్‌ కాళ్లకు ప్యాడ్స్‌, తలకు హెల్మెట్‌, చేతులకు గ్లవ్స్‌ లేకుండానే క్రీజులోకి వచ్చాడు. అయితే అంపైర్‌ అందుకు అంగీకరించలేదు. బ్యాటర్‌కు కనీస రక్షణ అవసరమని అభ్యంతరం వ్యక్తం చేయడంతో హరీస్‌ ఎట్టకేలకు గ్లవ్స్‌, హెల్మెట్‌ తెచ్చుకుని ఆదరాబాదరాగా నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో నిలబడ్డాడు. అంపైర్ల బలవంతం మీద తలకు హెల్మెట్‌ పెట్టుకున్నా గ్లవ్స్‌ మాత్రం ధరించలేదు. కాళ్లకు ప్యాడ్స్‌ లేకుండా నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఉన్న హరీస్‌ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ గా మారింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఇంత టాలెంటెడ్‌లా ఉన్నావేంట్రా అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.



Source link

Related posts

IND vs BAN T20 World Cup 2024 india vs Bangladesh predicted playing XI fantasy team squads preview and prediction

Oknews

ఆఫ్గాన్ క్రికెట్ కు అండగా బీసీసీఐ

Oknews

Bcci Announces Wpl Second Season Schedule

Oknews

Leave a Comment