Kcr Meet With Nalgonda Party Leaders: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Kcr) కసరత్తు ముమ్మరం చేశారు. బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసంలో నల్గొండ జిల్లా పార్టీ నేతలతో సోమవారం సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థుల ఎంపికపై నేతలతో చర్చించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.
చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. pic.twitter.com/YyMSPSTk6q
— BRS Party (@BRSparty) March 11, 2024
కాగా, బీఆర్ఎస్ తరఫున చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేరు ఖరారైనట్లు సమాచారం. చేవెళ్లతో పాటు నల్గొండ జిల్లాలోని భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల ఎన్నికల కార్యాచరణపైనా నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి విషయంలో నేతలతో చర్చించారు. అయితే, వ్యక్తిగత, ఇతర కారణాలతోనే రంజిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఆయన పార్టీలోనే కొనసాగుతారని కేసీఆర్ కు నేతలు వివరించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల ఫలితాల పరంగా చూస్తే మెజార్టీ ఉందని.. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం. కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి నేతలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. లోక్ సభ టికెట్ ఆశించి.. ఆ తర్వాత వెనక్కి తగ్గిన గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఆశావహ అభ్యర్థులకు సంబంధించి కేసీఆర్ ఆరా తీశారు.
Also Read: Laser Lights Show Hussain Sagar:హైదరాబాద్ ప్రజలకు మరో కానుక, దేశంలోనే తొలిసారిగా హుస్సేన్‌సాగర్ అలలపై లేజర్ షో
మరిన్ని చూడండి
Source link