Latest NewsTelangana

BRS Chief KCR Released The Manifesto For 2023 Telangana Assembly Elections | ప్రజలకు ఐదు లక్షల కేసీఆర్ బీమా- నెల పింఛన్‌ ఐదు వేలు


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అదిరిపోయే మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విడుదల చేశారు. ఈసారి ఎన్నికల్లో పోటీ హోరాహోరీ ఉంటుందని సర్వేలు చెబుతున్న టైంలో కేసీఆర్‌ మరోసారి సంక్షేమ మేనిఫెస్టోతో ఓటర్ల ముందుకు వెళ్లనున్నారు. 

బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన మేనిఫెస్టోను కేసీఆర్ విడుదల చేశారు. ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించి అధికారం చేపట్టి కేసీఆర్ హ్యాట్రిక్‌ లక్ష్యంగా సంక్షేమ మేనిఫెస్టును రూపొందించారు. ఆయా చాలా రోజులుగా దీనిపై కసరత్తు చేసినట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు అవుతున్న పథకాలను బేరీజు వేసుకుని అమలు సాధ్యమయ్యే పథకాలను తీసుకొచ్చారు. 

ఇప్పటికే రెండు విడతలుగా కాంగ్రెస్ తన మేనిఫెస్టోలోని కొన్ని అంశాలను ప్రకటించింది. వాటిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఆ పథకాలు జనాల్లోకి బాగానే రీచ్ అయ్యాయి. అందుకే దానికి దీటుగా ఉండేలా కేసీఆర్ తన మార్క్ మేనిఫెస్టోను విడుదల చేశారు. మొదటి సారి పూర్తిగా సంక్షేమ అజెండా తెలంగాణ పునర్‌నిర్మాణం పేరుతో అధికారం చేపట్టిన కేసీఆర్, రెండోసారి అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను ప్రకటించారు. ఇప్పుడు మూడోసారి అదే పంథాను అనురిస్తున్నారు. 

రెండు దపాలుగా చెెప్పిన దాని కంటే ఎక్కువగా అమలు చేశామన్నారు. మేనిఫెస్టోలో చెప్పనవి కూడా చేశామన్నారు. కళ్యాణి లక్ష్మి, విదేశీ విద్య ఎక్కడా ప్రకటించకపోయినా అమలు చేశామన్నారు. దాదాపు 99.9 శాతం ఎన్నికల ప్రణాళికలను అమలు చేశాం. రాష్ట్రంలో దళితులకు

దళిత బంధు ప్రకటించాం. 

ఇప్పుడు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చే ఆరునెలల్లో అమలు చేస్తామన్నారు కేసీఆర్. 

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు

ప్రజలందరికీ ఐదు లక్ష కేసీఆర్ బీమా 

ఒక కోటీ పది లక్షల్లో 93 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించి రైతు బీమా తరహాలో కేసీఆర్‌ బీమా ప్రతి ఇంటికీ ధీమా పేరుతో వచ్చే బడ్జెట్‌లో పెట్టనున్నాం అన్నారు. ఎల్‌ఐసీ ద్వారానే ఈ బీమా ఇవ్వబోతున్నాం. తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి ఈ బీమా సౌకర్యం అందబోతోంది. దీనికి ఒక్కో కుటుంబంపై నాలుగు వేల రూపాయల వరకు ఖర్చు చేయనుంది. ఇది రైతు బీమా తరహాలోనే ఉంటుంది. కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే పది రోజుల్లోనే ఐదు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చేరనుంది. అన్ని కుటుంబాలకు రక్షణగా ఉంటుంది. 

రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం

అన్నపూర్ణలా తయారైన రాష్ట్రం ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వకూడదనే ఆలోచన చేస్తున్నాం. అందుకే ప్రతి కుటుంబానికి సన్నబియ్యం ఇవ్వబోతున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం ఇస్తాం.  

నెల పింఛన్లు ఐదు వేలకు పెంపు 

దళిత బంధు కొనసాగింపు

ముస్లిం బడ్జెట్ పెంపునకు హామీ

 

 

 



Source link

Related posts

Tripti Dimri Clarity about Marriage Rumours on Her కాబోయేవాడిపై తృప్తి డిమ్రి కామెంట్స్

Oknews

'లాల్ సలామ్‌' ట్రైలర్ అదిరింది.. సూపర్ స్టార్ మళ్ళీ సునామీ సృష్టిస్తాడా?

Oknews

సింప్లిసిటీ అంటే అదీ.. వైరల్‌ అవుతున్న బాలకృష్ణ వీడియో!

Oknews

Leave a Comment