Latest NewsTelangana

CCTV cameras in Anganwadi centres Soon Telangana CM Revanth Reddy


CCTV cameras in Anganwadi centres: హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బయోమెట్రిక్ హాజరు ఉండేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత శాఖ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అంగన్వాడీల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అందుకోసం అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టిసారించాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

petrol diesel price today 07 March 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 07 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

hyderabad young man died in russia ukraine war | Hyderabad News: రష్యా

Oknews

మార్చి 29న ‘తలకోన’ విడుదల

Oknews

Leave a Comment