Latest NewsTelangana

Central Government Grants Funds To Construct Two Hostels In Osmania University


తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు త్వరలోనే కొత్త వసతి గృహాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ హాస్టళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొత్తంగా రూ.30 కోట్ల అంచనా వ్యయంతో అబ్బాయిలు, అమ్మాయిలకు రెండు వేర్వేరు వసతి గృహాల నిర్మాణానికి నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి తొలివిడతగా రూ.7.50 కోట్లు విడుదల చేసింది. 

ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉస్మానియా వర్సిటీని సందర్శించారు. వర్సిటీలో ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు కిషన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వర్సిటీ వీసీ, ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఇదే అంశంపై కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రితో కిషన్ రెడ్డి చర్చించారు.

సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దాదాపు రూ.30 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో వర్సిటీలో రెండు వసతి గృహాలు నిర్మించేందుకు అంగీకరించారు. ఒక్కో వసతి గృహంలో 250 మంది విద్యార్థులు ఉండేలా రెండు హాస్టళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు.

ఎంబీబీఎస్ పాస్ మార్కులపై కీలక నిర్ణయం, పాత విధానానికే మొగ్గు
ఎంబీబీఎస్ పాస్ పర్సంటేజ్‌ను ఇటీవల 40 శాతానికి తగ్గించిన నేషనల్ మెడికల్ కమిషన్.. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాతవిధానం ప్రకారం 50 శాతం పాస్ పర్సంటేజ్ ఉంటుందని తాజాగా ప్రకటించింది. పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాన్ని మార్చుకున్నట్టు శుక్రవారం (అక్టోబరు 6న) అధికారికంగా ఓ నోటిఫికేషన్‌ను ఎన్‌ఎంసీ విడుదల చేసింది. సాధారణంగా ఎంబీబీఎస్ కోర్సు చివరలో అగ్రిగేట్ సబ్జెక్టుల్లో(థియరీ, ప్రాక్టికల్ కలిపి) ఓవరాల్‌గా 50 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణతగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్‌లో ఈ పాస్‌ పర్సంటేజ్‌ను 40 శాతానికి తగ్గిస్తూ ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా కాంపిటెన్సీ బేస్డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎంఈ) పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్‌) మార్గదర్శకాలను సవరించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

ALSO READ:

అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో పీజీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ‘స్పాట్‌’ కౌన్సెలింగ్‌, ఎప్పుడంటే?
గుంటూరులోని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్‌ విభాగంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...



Source link

Related posts

Does Anupama feel like that? అనుపమ అంతలా ఫీల్ అయ్యిందా?

Oknews

‘జీన్స్‌’ ప్రశాంత్‌ వీడియో వైరల్‌.. పోలీసులేం చేస్తున్నారు.. నెటిజన్స్‌ ఫైర్‌!

Oknews

కన్నీళ్లు  పెట్టుకున్న తెలంగాణ నటుడు..

Oknews

Leave a Comment