అభ్యర్థుల రేసులో వీరు……..అయితే పార్లమెంట్ స్థానల నుంచి పోటీ చేసేందుకు చాలా మంది కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపుతున్నారు.చేవెళ్ల నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి తమ అభ్యర్థనలను ఉంచినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ టికెట్ తమకే కేటాయిస్తారన్న నమ్మకంతో పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు నాయకులు వాల్ పోస్టర్స్ సైతం వేసే పనిలో పడ్డారు. వారిలో ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్కె లక్ష్మారెడ్డి, టిపిసిసి ప్రతినిధి సత్యంరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.అయితే ఇటీవల జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ సమావేశంలో సత్యం రావును చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నిలపాలని ప్రతిపాదిస్తూ జిల్లా నాయకులు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదం తెలిపినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. సత్యంరావు అయితే అన్ని రకాలుగా బాగుంటుందని ,గత మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ప్రజలకు,కేడర్ కు అందుబాటులో ఉంటున్నారని అయన అనుచరులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Source link