దిశ, ఫీచర్స్: చికెన్ ప్రియుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు నగరవాసులు చికెన్, మటన్ షాపుల్లో క్యూ కడతారు. సండే చాలా మందికి ముక్క లేనిది ముద్ద దిగదనుకోండి. మిగతా రోజులు ఎలా ఉన్నా సరే.. కానీ సండే మాత్రం తప్పకుండా నాన్ వెజ్ ఉండాల్సిందే. కొంతమంది మంది కేవలం ఆదివారం మాత్రమే చికెన్ తింటే మరికొంతమంది వారంలో నాలుగైదు రోజులు తింటుంటారు. పైగా తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులే ఎక్కవగా ఉన్నారు.
చికెన్, మటన్, ఫిష్ తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే చికెన్‌లోని స్కిన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ ఆరోగ్యానికి మంచిది కాదని స్కిన్ తినకుండా ఉంటారు. అయితే వర్షాకాలంలో చికెన్ స్కిన్ తింటే మంచిదేనా? అని పలువురు జనాలు అనుమానాలు వ్యక్తం చేయగా.. నిపుణులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. వానాకాలంలో చికెన్ తింటే ఏమవుతుందో ఆరోగ్య నిపుణులు చెప్పిన విషయాలు ఇప్పుడు చూద్దాం..
చికెన్ స్కిన్ తింటే ఆరోగ్యానికి హానికరం అని భావించడం కేవలం అది ఊహ మాత్రమే. చికెన్ స్కిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు. అందులో కొవ్వు ఉంటుందని, గుండెకు ప్రమాదమని అంటారు. కానీ చికెన్‌లో జస్ట్ 8 గ్రాముల అసంతృప్తి కొవ్వు, 3 గ్రాముల సంతృప్తి కొవ్వు మాత్రమే ఉంటుంది. తాజాగా నిపుణులు చికెన్‌లో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వు ఉన్నట్లు గుర్తించారు. ఇది బాడీలోని కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. అంతేకాకుండా హార్మోన్ల సమస్యలకు చెక్ పెడుతోంది.
కానీ వర్షాకాలంలో చికెన్ పాటు చికెన్ స్కిన్ కూడా తక్కువగా తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఇటీవల రోజుల్లో కోళ్లు తొందరగా ఎదగడానికి దాణాతో పాటు పలు రకాల యాంటీబయాటిక్ మందులు ఇస్తున్నందున చికెన్.. వర్షాల కారణంగా కోళ్లలో పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, కోళ్ల ఫారాల చుట్టు పెరిగే తేమ కారణంగా న్యూమోనియా, కాక్సిడియోసిస్, కొక్కెర వంటి రోగాలు వస్తాయి కాబట్టి స్కిన్ కు తినకపోవడమే బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. కాగా వర్షాకాలంలో చికెన్ అండ్ చికెన్ స్కిన్‌కు దూరంగా ఉండటమే మంచిది.