సినిమాలు నిర్మించడం కన్నా వెబ్ సిరీస్ లను సెట్ చేసుకోవడం బెటర్ అంటున్నారు చాలా మంది సినీ ప్రముఖులు. కొన్నాళ్ళకు ఓటీటీ వరల్డ్ లో సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా వెబ్ సిరీస్ ల సంఖ్య అమితంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక మెగా ఫ్యామిలీలో త్వరలో ఒక కొత్త ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ కానుంది. చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఆమె భర్త విష్ణు ప్రసాద్ కలిసి సొంతంగా ఓటీటీ బిజినెస్ ని టార్గెట్ చేస్తూ ఒక ప్లాన్ వేశారు.
2009లో విడుదలైన ఓయ్ సినిమా దర్శకుడు ఆనంద్ రంగాతో త్వరలో వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆ దర్శకుడి దగ్గర ఉన్న ఒక స్క్రిప్ట్ బాగా నచ్చడంతో చాలా రోజుల క్రితమే మెగా డాటర్ అతనికి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసి అందులో వీలైనంత వరకు మంచి వెబ్ సిరీస్ లను నిర్మించాలని అనుకుంటున్నారు.
గత ఏడాది నుంచి సుస్మిత ఈ విషయంపై తన తండ్రితో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఎలాంటి విషయాలని బయటపెట్టలేదు. కరోనా కాస్త అదుపులోకి వచ్చిన అనంతరం అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ ఇచ్చి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అనుకుంటున్నారు.
Topics: