Latest NewsTelangana

Chiranjeevi makes key comments on Nandi awards renaming as Gaddar awards


Chiranjeevi Comments: సినీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టి ప్రదానం చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు గద్దర్‌ పేరు పెట్టాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కరెక్టేనని చిరంజీవి సమర్థించారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సహా కేబినెట్ సభ్యులు అందరికీ తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఇందుకోసం హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 

పద్మ అవార్డుల్లో భాగంగా పద్మవిభూషణ్‌ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సత్కరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. పద్మ విభూషణ్‌ పురస్కారం వచ్చాక వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ జన్మకు ఇక ఇది చాలు అనిపిస్తోందని అన్నారు. తన తల్లిదండ్రుల పుణ్యఫలం తనకు వచ్చిందని అన్నారు. పద్మ అవార్డులు వచ్చిన వారిని ప్రభుత్వం సన్మానించడం ఇదే మొదటిసారి అని అన్నారు. 

వెంకయ్యకు అభిమానిని – చిరంజీవి
వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ.. ఆయన వాగ్ధాటికి తాను పెద్ద అభిమానిని అని చిరంజీవి కొనియాడారు. రాజకీయాల్లో వెంకయ్య నాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడని అన్నారు. వాజ్‌పేయీ అంతటి హుందాతనం ఆయనలో ఉందని చెప్పారు. రాజకీయాల్లో అనవసర దూషణలు ఎక్కువైపోతున్నాయని.. ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేసేవాళ్లకి బుద్ధి చెప్పే శక్తి ప్రజలకే ఉందని చిరంజీవి అన్నారు.

రూ.25 లక్షల నగదు, పెన్షన్ కూడా

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించాం. ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం. తెలుగువాళ్లు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నా మనవారే. ఒక మంచి సంప్రదాయానికి పునాది వేసేందుకే ఈ కార్యక్రమం. ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించాలి. అవార్డు గ్రహీతలు ప్రభుత్వాన్ని అభినందించడమంటే.. మన ప్రజా పాలనను అభినందించినట్లే. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తాం. దీంతోపాటు ప్రతి నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు రూ.25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలి. ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

నువ్వు పుష్పరాజ్ అయితే నాకేంటి.. తగ్గేదేలే అంటున్న మంచు విష్ణు!

Oknews

అధిక జీతం ఆశచూపి, బలవంతంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధంలోకి-హైదరాబాద్ యువకుడు మృతి-hyderabad news in telugu youth died in ukraine russian war forced to work ,తెలంగాణ న్యూస్

Oknews

Anasuya Morning Josh అనసూయ మార్నింగ్ జోష్

Oknews

Leave a Comment