GossipsLatest News

Clarity on TDP and Janasena Seats in East Godavari తూ.గో. టీడీపీ, జనసేన సీట్లపై క్లారిటీ


ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల్లో టెన్షన్ పెరుగుతోంది. వైసీపీ అయితే దాదాపు నియోజకవర్గ ఇన్‌చార్జుల జాబితా పూర్తి చేసింది. ఇక టీడీపీ, జనసేనలు అభ్యర్థులను ఫిక్స్ చేయాల్సి ఉంది. ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల విషయమై కొన్ని స్థానాలు మినహా టీడీపీ, జనసేనల మధ్య సీట్ల పంపకంలో క్లారిటీ వచ్చేసింది. ఇంకా ఆరు సీట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఖరారైన పది మంది అభ్యర్థుల్లో పార్టీ సీనియర్ నేతలు, ఇద్దరు నేతల వారసులు కూడా ఉన్నారు. ఇక మూడు స్థానాలను జనసేనకు కేటాయించడం జరిగింది. 

రెండు స్థానాలపై అస్పష్టత..

ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రెండు సీట్లను జనసేన అధినేత పవన్ ప్రకటించారు. వాటిలో కాకినాడ రూరల్‌, రాజానగరం, రాజోలు సీట్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు సమాచారం. ఇవి కాకుండా జిల్లో మరో రెండు సీట్లను జనసేన కోరుతోంది. పిఠాపురం సహా మరొక స్థానాన్ని జనసేన కోరుతోంది. అయితే పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ చాలా స్ట్రాంగ్. అందుకే ఈ స్థానం విషయంలో టీడీపీ కొంత సంశయంలో ఉంది. ఈ రెండు స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మరో ఐదు స్థానాలపై క్లారిటీ అయితే వచ్చింది కానీ టీడీపీ కసరత్తు మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 

ఆ ఐదు టీడీపీ స్థానాల కోసం పెద్ద ఎత్తున నేతలు పోటీ పడుతున్నారు. రామచంద్రాపురం టికెట్ కోసం ఏకంగా ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. అమలాపురం నుంచి రెండు పేర్లు అధిష్టానం పరిశీలనలో ఉన్నాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. రంపచోడవరంలో ముగ్గురు, కాకినాడ అర్బన్‌లో నలుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. 

ఫిక్స్ అయిన 10 మంది అభ్యర్థులు.. 

తుని – యనమల దివ్య 

వరుపుల సత్యప్రభ – ప్రత్తిపాడు

నిమ్మకాయల చినరాజప్ప -పెద్దాపురం

నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి-అనపర్తి

దాట్ల సుబ్బరాజు – ముమ్మిడి వరం

బండారు సత్యానందరావు-కొత్తపేట

వేగుళ్ల జోగేశ్వర రావు-మండపేట

గోరంట్ల బుచ్చయ్య చౌదరి- రాజమండ్రి రూరల్

జ్యోతుల నెహ్రూ-జగ్గంపేట

రాజమండ్రి అర్బన్‌లో ఆదిరెడ్డి కుటుంబానికి కేటాయించడం జరిగింది.





Source link

Related posts

అప్పుడే ఓటీటీలోకి లియో!

Oknews

KTR Rajendra Nagar School Anniversary: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేటీఆర్, పిల్లలతో కలిసి సరదాగా…

Oknews

Allu Arjun Talks About Pushpa 3 పుష్ప3 కూడా ఉంటుంది: అల్లు అర్జున్

Oknews

Leave a Comment