Telangana

CM Revanth Reddy : ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దు



గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి…. ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందన్నారు. . అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్లైన్ విధించారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని సీఎం హెచ్చరించారు.



Source link

Related posts

| Tata Group : తెలంగాణ ఐటీఐలలో టాటా గ్రూప్ స్కిల్ సెంటర్లు

Oknews

Koushik Reddy: ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన సర్పంచ్.. కార్యదర్శిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్

Oknews

TS DSC Free Coaching : డీఎస్సీ అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్, రూ. 1500 బుక్ ఫండింగ్ కూడా..! ఇలా అప్లయ్ చేసుకోండి

Oknews

Leave a Comment