Latest NewsTelangana

cm revanth reddy interesting tweet on meet with people | CM Revanth Reddy: ‘నేను చేరలేని దూరం కాదు, దొరకనంత దుర్గం కాదు’


CM Revanth Reddy Interesting Tweet on Meet With People: సామాన్య ప్రజలకు తాను నిత్యం అందుబాటులో ఉంటానని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో సీఎం మాదిరి కాకుండా తాను నిత్యం ప్రజల సమస్యలు వింటానని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసానికి భారీగా వచ్చిన వారి సమస్యలను నేరుగా వినడంతో పాటుగా.. వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొన్ని సమస్యలను కోడ్ అనంతరం పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు సమాచారం. 

ఏం ట్వీట్ చేశారంటే.?

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘నేను… చేరలేని దూరం కాదు… దొరకనంత దుర్గం కాదు… సామాన్యుడు మనిషిని నేను… సకల జన హితుడను నేను.’ అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

Also Read: BRS: భువనగిరి, నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు – కేసీఆర్ కీలక ప్రకటన

మరిన్ని చూడండి





Source link

Related posts

Telangana Gurukulam Application Deadline Extended For 5th Class Admissions Check Last Date Here

Oknews

అయోధ్య‌కు ప్రభాస్ రూ.50 కోట్లపై క్లారిటీ!

Oknews

డైరెక్టర్ అన్వేషణలో చిరంజీవి.. విశ్వంభర రిజల్ట్ తో సంబంధం లేదు

Oknews

Leave a Comment