Jaggareddy Fires on Fan: ‘సార్ మళ్లీ మీరు గెలిచే వరకూ నేను చెప్పులు వేసుకోను’ అన్న ఓ అభిమానికి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి హితబోధ చేశారు. ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్నా.. నీకెందుకు అంత బాధ అంటూ ప్రశ్నించారు. సంగారెడ్డిలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డిలో కార్యకర్తలు తీవ్రంగా శ్రమించినా.. నా టైం బాగోలేక తాను ఓడిపోయానని అన్నారు. సంగారెడ్డిలో తాను ఓడిపోయినా మెదక్ పార్లమెంట్ లో మాత్రం కాంగ్రెస్ గెలవాలని అన్నారు. అందుకు అంతా కృషి చేయాలని సూచించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానిని చేయాలని అన్నారు.
అభిమానికి హితబోధ
‘జగ్గారెడ్డి మళ్లీ గెలిచే వరకూ చెప్పులు లేకుండా తిరుగుతాను’ అంటూ ఓ అభిమాని తెలపగా.. ఈ విషయాన్ని సభలో జగ్గారెడ్డి దృష్టికి నేతలు తీసుకెళ్లారు. దీంతో ఆయన ఆ అభిమానిని పిలిచి సున్నితంగా మందలించారు. ‘ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్నా. నేను గెలవాలని ప్రచారం చేసిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు. నీకెందుకు అంత బాధ. చెప్పులు లేకుండా తిరిగితే ఏమైనా అయితే.. నేను ఆస్పత్రి వరకే వస్తాను. డబ్బులు ఇస్తాను. కానీ, నీ వెంట నేను రాలేను కదా. అభిమానం ఉంటే మనసులోనే ఉంచుకోవాలి. కానీ ఇలా చెయ్యొద్దు.’ అంటూ సదరు అభిమానికి హితబోధ చేశారు.
Also Read: కాంగ్రెస్‌తో ఎంఐఎం పొత్తు ఉందా? క్లారిటీ ఇచ్చిన ఒవైసీ
మరిన్ని చూడండి
Source link