ByGanesh
Thu 14th Mar 2024 01:12 PM
గత శుక్రవారం రెండు తెలుగు సినిమాలతో పోటీపడిన మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. మలయాళంలో హిట్ అయిన ప్రేమలు చిత్రాన్ని తెలుగులో రాజమౌళి కొడుకు కార్తికేయ డబ్ చేసి విడుదల చేసాడు. తెలుగులో మీడియం రేంజ్ హీరోగా గోపీచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి చిత్రాల కలెక్షన్స్ కి మించి ప్రేమలు కలెక్షన్స్ సాధిస్తుంది. యూత్ మొత్తం ప్రేమలు చిత్రంలోని కామెడీని ఎంజాయ్ చెయ్యడం, రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చెయ్యడంతో ఈ చిత్రం తెలుగులో కూడా హిట్ మూవీగా నిలిచింది.
భీమా, గామి కలెక్షన్స్ కూడా ప్రేమలు దాటేసింది. మరి ఇక్కడ కూడా యూత్ఫుల్ హిట్ గా నిలిచిన ప్రేమలు ఓటీటీ రిలీజ్ పై అందరిలో క్యూరియాసిటీ మొదలు కావడమే కాదు.. ఈ చిత్రం ఏ ఓటీటీ నుంచి రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. మరి ప్రేమలు చిత్ర ఓటీటీ హక్కులు ఫ్యాన్సీ డీల్ తో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకోగా.. ఈ చిత్రాన్ని మార్చి 29 ఉంచి స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
మార్చ్ 8 న తెలుగులో మార్చ్ 15 న తమిళ్ లో విడుదల కాబోతున్న ప్రేమలు చిత్రం అన్ని భాషల్లోను మార్చి 29 నుంచే డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుంచి స్ట్రీమింగ్ కి సిద్దమవుతున్నట్లుగా టాక్.
Crazy news on Premalu OTT:
Malayalam Movie Premalu OTT Release Date Delayed