Latest NewsTelangana

Criticism Started Between BRS And Congress Over The Installation Of Phule’s Statue In The Assembly | Poole Statue Politics : తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఇష్యూ పూలే విగ్రహం


Poole Statue Politics :  తెలంగాణ రాజకీయాల్లో పూలే విగ్రహ అంశంపై కొత్త వివాదం ప్రారంభమయింది. మొదట కవిత అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావుపూలే విగ్రహం పెట్టాలని స్పీకర్ కు వినతి పత్రం ఇచ్చారు. తర్వాత సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంత్రి పొన్నం కవితపై విమర్శలు చేయడంతో రాజకీయం ప్రారంభమయింది. 

అసెంబ్లలో పూలే విగ్రహం కోసం కవిత డిమాండ్ 

అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావ్‌ పూలే విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు భారత జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.  స్పీకర్‌ను కలిసి ఎమ్మెల్సీ కవిత వినతిపత్రం అందజేశారు.  జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేసి అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుకున్నామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో పూలే విగ్రహం కోసం ఉద్యమిస్తామని చెప్పారు.  ఏప్రిల్‌ 11న పూలే జయంతి లోపు స్పీకర్‌, ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారత జాగృతి ఆధ్వర్యంలో ఇతర బీసీ సంఘాల మద్దతుతో వివిధ కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు.  అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావ్‌ పూలే విగ్రహం ఏర్పాటు అంశంపై ఈ నెల 26న హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.  

 



 

కవిత డిమాండ్ పై ఘాటుగా స్పందించిన  పొన్నం 

తెలంగాణ అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని ఎమ్మెల్సీ కవిత చేసిన డిమాండ్ పై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు  అణగారిన జీవితాల్లో వెలుగుల దారులు పంచిన మహోన్నతుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని..  ఆ మహనీయుడి విగ్రహం అసెంబ్లీ లో ప్రతిష్టించాలని మీరు కోరడం మరీ విడ్డూరమని కవితపై మండిపడ్డారు.  పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు యాదికి లేని మహాత్మా జ్యోతిరావు పూలే గారిని .మీకు ఎరుక చేసిన తెలంగాణ ఓటర్ల చైతన్యానికి వందనమని సెటైర్ వేశారు.  అణచివేత కు వ్యతిరేకంగా పూలే సలిపిన పోరాటమే మా ప్రభుత్వానికి ఆదర్శం…అందుకే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ అని పెట్టుకున్నాం, ప్రజా పాలన అందిస్తున్నామన్నారు.  మీ నియంత్రుత్వానికి ఎదురు తిరిగితే  ఒక బీసీ మహిళ అని చూడకుండా జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ను ఏడిపించింది మీరు కాదా? బీసీ బిడ్డగా అడుగుతున్నా..మీ నియోజకవర్గంలో ఎంతమంది బీసీలకు మీరు అధికారాలు ఇచ్చారు?
బీసీ మంత్రిగా ఉన్నా..నేను ఉద్యమకారుడినే..అణగారిన వర్గాలకు ఆప్తున్ని, సబ్బండ కులాలకు సోదరుడిని ..మీ పార్టీ అధ్యక్ష పదవి , కార్యనిర్వహాక అధ్యక్ష పదవి , లీడర్ ఆఫ్ అపొజిషన్ బీసీ లకు ఇవ్వగలరా అని ప్రశ్నించారు.   

 



 

పొన్నంకు కౌంటర్ ఇచ్చిన కవిత 

పొన్నం విమర్శలపై కవిత సోషల్ మీడియా వేదికగా స్పందించారు.   అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని రాజకీయాలకు అతీతంగా కోరుతుంటే ఎందుకు మీరు రాజకీయ రంగు పులుముతున్నారనిప్రశ్నించారు.  అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చేయడమే మీకు అభ్యంతరమా అని ప్రశ్నించారు.  అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా ?  స్ఫూర్తిదాయక వీరులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే జాగృతి సంస్థ ద్వారా పోరాటం చేసి అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయించామని..  ఇప్పుడు కూడా అసెంబ్లీ ఆవరణలో పూలే గారి విగ్రహ ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా మరో పోరాటాన్ని సాగిస్తామని తెలిపారు.  మహాత్మా జ్యోతిరావు పూలే మహోన్నతుడు, అణగారిన ప్రజల్లో చైతన్యం నింపిన మహా మనిషి! అందుకే ఏప్రిల్ 11 నాటికి పూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని భారత జాగృతి తరుపునే కాకుండా యావత్‌ తెలంగాణ ప్రజల తరుపున వినమ్రంగా మరోసారి కోరుతున్నాననన్నారు. 

 



 

ఈ అంశంపై కవిత వరుస కార్యక్రమాలను ఖరారు చేసుకోవడంతో రాజకీయ వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. 





Source link

Related posts

ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న బిగ్ బాస్ మోనిత

Oknews

Everyone is interested in Ugadi updates ఉగాది అప్ డేట్స్ పై అందరి ఆసక్తి

Oknews

Alert in Hyderabad : బెంగుళూరులో పేలుళ్లు – హైదరాబాద్ లో హై అలర్ట్, పలుచోట్ల తనిఖీలు!

Oknews

Leave a Comment