CSK Fan Murdered by two MI Fans: ఐపీఎల్ (IPL)మ్యాచ్‌లో తలెత్తిన తీవ్ర వాగ్వాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల ముంబై ఇండియన్స్(MI) అభిమానుల దాడిలో గాయపడిన చెన్నై సూపర్ కింగ్స్(CSK) ఫ్యాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న (మార్చి 31) మృతి చెందాడు. రోహిత్ శర్మ వికెట్ పడిందని సంబరాలు చేసుకున్నందుకు కొందరు అభిమానులు ఆ వ్యక్తి తల పగలకొట్టారు. వ్యక్తి మృతికి కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై వర్సెస్ సన్‌రైజర్స్ మ్యాచ్
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో కొంతమంది ఒకచోట చేరి హైదరాబాద్, ముంబై మ్యాచ్‌ను చూశారు. వీరిలో కొంతమంది సీఎస్‌కే అభిమానులుంటే, మరికొంత మంది ముంబై ఫ్యాన్స్ ఉన్నారు. వీరిలో బందోపంత్ బాపూసో తిబిలే అనే వ్యక్తి చెన్నై సూపర్ కింగ్స్ వీరాభిమాని. సాగర్ సదాశివ్ జంజగే, బల్వంత్ మహదేవ్ జంజగే ముంబై అభిమానులు. వీరంతా కలిసి మార్చి 27న జరిగిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్‌ను టీవీలో చూశాడు.
హేళనగా మాట్లాడినందుకు వివాదం..
హైదరాబాద్ ఇచ్చిన 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు అద్భుత శుభారంభం అందించారు. అయితే అతి తక్కువ వ్యవధిలోనే రెండు వికెట్లు పడ్డాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ వికెట్ పతనం ముంబై ఇండియన్స్ శిబిరాన్ని షాక్ కు గురి చేసింది. ఫాన్స్ కూడా హర్ట్ అయ్యారు . అప్పుడే సీఎస్‌కే అభిమాని అయిన తిబిలే , ముంబై ఇండియన్స్ అభిమానులైన సాగర్, బల్వంత్‌లతో హేళనగా మాట్లాడాడు. కోపంతో వీరిద్దరూ తిబిలేతో వాగ్వాదానికి దిగారు. క్రమేపీ ఈ గొడవ ఒకరినొకరు కొట్టుకునే దాకా వెళ్లింది. ఈ ఘర్షణలో ముగ్గురికి గాయాలయ్యాయి. అయితే గొడవ తీవ్రరూపం దాల్చడంతో సాగర్, బల్వంత్ లు పక్కనే ఉన్న కర్రలు అందుకుని బండుపంత్ తిబిలేతలపై తీవ్రంగా కొట్టారు. దీంతో అతని చెవులు, ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది. తలకు బలమైన గాయమై స్పృహతప్పి నేలపై పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన తిబిలే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తిబిలే ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచాడు. . టిబిల్‌కు భార్య, వివాహితులైన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నిందితులు సాగర్ జాంగే, బల్వంత్ జాంగేలపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించింది. అయితేనేం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను వణికించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ ఈ విశాఖ మైదానాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్నా గ్రౌండ్ అంతా పసుపుమయం అయిపోయింది. మ్యాచ్ గెలుపు ఢిల్లీదే అయినా ధోనీ మానియాతో అభిమానులు ఊగిపోయారు. మహేంద్ర సింగ్ ధోని జోరు చూశాక.. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండేవి.
మరిన్ని చూడండి