Sports

CSK Suffer Major Injury Blow Ahead Of IPL 2024 As Devon Conway Ruled Out Until May


Devon Conway ruled out until May:  ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్‌ మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్‌ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్‌… రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్‌… రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే తొలి మ్యాచ్‌కు సమయం సమీపిస్తున్న వేళ చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాక్‌ తగిలింది.

కాన్వే దూరం!
గాయం కారణంగా న్యూజిలాండ్ బ్యాటర్ డేవన్ కాన్వే ఈ సీజన్‌ తొలి భాగంలో ఆడటం లేదు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ సందర్భంగా కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయం కావడంతో చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాక్‌ తగిలింది. అతడిని పరిశీలించిన వైద్యబృందం శస్త్రచికిత్స అవసరమని.. కనీసం 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో కన్వే కనీసం రెండు నెలలపాటు క్రికెట్‌కు దూరం ఉంటాడని తెలుస్తోంది. ఏప్రిల్ చివరినాటికి సిద్ధమై.. ఐపీఎల్‌ రెండో సగానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గత సీజన్‌లో సీఎస్‌కే తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ కాన్వేనే. 16 మ్యాచుల్లో 672 పరుగులు చేశాడు. అయితే కాన్వే దూరం కావడంపై సీఎస్‌కే నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

జార్ఖండ్‌ గేల్‌కు రోడ్డు ప్రమాదం
మరో విధ్వంసకర బ్యాటర్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడన్న వార్తతో క్రికెట్‌ ప్రపంచం భయాందోళనలకు గురైంది. జార్ఖండ్ క్రిస్ గేల్‌, ధోనీ వార‌సుడిగా పిలుచుకుంటున్న రాబిన్ మింజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఐపీఎల్‌ 2024 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ రాబిన్‌ను ఊహించని ధర దక్కించుకుంది. రాంచీలో బైక్‌పై వెళ్తుండగా రాబిన్‌ ప్రయాణిస్తున్న కవాసకీ సూపర్‌బైక్‌ అదుపు తప్పి వేగంగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత‌డు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని అత‌డి తండ్రి ఫ్రాన్సిన్ మింజ్ తెలిపాడు. శ‌నివారం ట్రైనింగ్ ముగించుకొని ఇంటికి వ‌స్తుండ‌గా రాబిన్ బైక్ స్కిడ్ అయిందని… ముందు ఒక బండి ఉండడంతో రాబిన్ త‌న బైక్‌ను నియంత్రించ‌లేక కింద ప‌డిపోయాడని రాబిన్‌ తండ్రి వెల్లడించాడు. దాంతో, అత‌డికి చిన్నపాటి గాయాల‌య్యాయని… ప్రస్తుతానికి అత‌డి అరోగ్యాన్ని వైద్యులు ఎప్పటిక‌ప్పుడు ప‌ర్యవేక్షిస్తున్నారని ఫ్రాన్సిస్ వెల్లడించాడు. ఐపీఎల్ సీజ‌న్ ఆరంభానికి ఇంకా రెండు వారాల పైనే ఉంది. ఆలోపు రాబిన్ కోలుకోవాల‌ని గుజ‌రాత్ అభిమానులు కోరుకుంటున్నారు. 21 ఏళ్ల రాబిన్‌ను 2024 ఐపీఎల్‌ వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ 3.6 కోట్లకు సొంతం చేసుకుంది.



Source link

Related posts

Former India Cricketer Kirti Azad Urges BCCI To Make Ranji Trophy Participation Compulsory For Kohli And Rohit

Oknews

Rohit Sharma And Team India Broke Many Records Against Afghanistan In World Cup Match | Rohit Sharma: రికార్డుల మోత మోగించిన రోహిత్

Oknews

You Dont Need Big Names Sunil Gavaskar Made Huge Claims On Team India Triumph

Oknews

Leave a Comment