Brs Leaders Danam And Ranjith Reddy Joined in Congress: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బల తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్జి (Ranjith Reddy), ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar) ఆదివారం కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ.. వారికి హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, ఆదివారం ఉదయమే రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అటు, దానం నాగేందర్ ఇటీవలే సీఎం రేవంత్ ను కలిశారు. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని.. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి, టిపిసిసి అద్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల బీఆరెస్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు.#JoiningsInCongress pic.twitter.com/4hPJhvYT0k
— Telangana Congress (@INCTelangana) March 17, 2024
Also Read: Aroori Ramesh: బీజేపీలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే – రెండ్రోజుల్లోనే ట్విస్ట్!
మరిన్ని చూడండి