Sports

DC Vs GT IPL 2024 Head to Head Records


DC Vs GT IPL 2024 Head to Head Records: ఐపీఎల్‌ 40వ మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌(GT vs DC) తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో ఉంది. గత మ్యాచ్‌లో గెలిచి గుజరాత్‌ పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకేందుకు.. ప్లే ఆఫ్‌కు చేరుకునేందుకు ఇరు జట్లకు ఈ మ్యాచ్‌ కీలకం కానుంది. డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా పూర్తిగా ఫిట్ లేకపోవడం గుజరాత్‌ను కాస్త కష్టాల్లోకి నెట్టింది.

హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
గుజరాత్-ఢిల్లీ ఇప్పటివరకు ఐపీఎల్‌ నాలుగుసార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్‌ రెండు మ్యాచుల్లో విజయం సాధించగా.. ఢిల్లీ రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గుజరాత్ అత్యధిక స్కోరు 171. గుజరాత్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 162. ఈ మ్యాచ్‌ల్లో శుభ్‌మన్ గిల్ 104 పరుగులు చేయగా, మహ్మద్ షమీ (9), రషీద్ ఖాన్ (5) ఎక్కువ వికెట్లు తీశారు.
పిచ్ నివేదిక రిపోర్ట్‌:

లోపాలను సరిదిద్దుకుంటేనే..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ సమస్యలన్నింటికీ చెక్‌ పెట్టాలని చూస్తోంది. విజయాలు సాధిస్తున్నా టైటాన్స్ ఇంకా పూర్తిగా గాడినపడినట్లు కనిపించడం లేదు. రాజస్థాన్ రాయల్స్‌పై చివరి బంతికి విజయం సాధించడం టైటాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. మరోవైపు ఢిల్లీ మొదటి ఆరు మ్యాచుల్లో కేవలం కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. లీగ్‌ల్లో ఇంకో ఎనిమిది మ్యాచ్‌లు మిగిలి ఉన్న వేళ ఇరు జట్లు లోపాలను సవరించుకుని గాడిన పడాలని చూస్తున్నాయి.

జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, మాథ్యూ వేడ్, కేన్ విలియమ్సన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, స్పెన్సర్ జాన్సన్ , కార్తీక్ త్యాగి, జాషువా లిటిల్, దర్శన్ నల్కండే, నూర్ అహ్మద్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మోహిత్ శర్మ, జయంత్ యాదవ్, ఉమేష్ యాదవ్, సుశాంత్ మిశ్రా, సందీప్ వారియర్, శరత్, మానవ్ సుతార్.

ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, అభిషేక్ పోరెల్, రికీ భుయ్, యశ్ ధుల్, షాయ్ హోప్, పృథ్వీ షా, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కుషాగ్రా, స్వస్తిక్ చికారా, ఇషాంత్ శర్మ, ఝే రిచర్డ్‌సన్, రసిఖ్ దార్ సలామ్, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నార్ట్జే, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, అక్షర్ పటేల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్

మరిన్ని చూడండి



Source link

Related posts

Adudam andhra event finals on tuesday in vishaka cm jagan will participate

Oknews

Afg vs Ban Super8 match Highlights | Afg vs Ban Super8 match Highlights | అత్యద్భుత విజయంతో T20 World Cup 2024 సెమీస్ కు ఆఫ్గాన్

Oknews

IND Vs ENG Sarfaraz Khan Slams Maiden Test Half Century In 3rd Test At Rajkot

Oknews

Leave a Comment