Indira Kranthi Scheme In Telangana: తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తుండగా.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించేలా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 12న మహిళలకు వడ్డీ లేని రుణాలు ‘ఇందిరా క్రాంతి పథకం’ (Indira Kranthi Scheme) ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ పథకం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. స్వయం సహాయక బృందాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలోని ప్రతీ మహిళను మహాలక్ష్మిలానే భావించి గౌరవిస్తున్నామని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
మరిన్ని చూడండి