దిశ, ఫీచర్స్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు చాలామంది కూల్ డ్రింక్స్, కొబ్బరి బోండాలు, ఐస్ క్రీంలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఐస్ క్రీం లలో కూడా ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. అంతే కాదు వ్యాపారులు కూడా ఐస్ క్రీం లను వివిధ రూపాల్లో తయారు చూస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ ఉంటారు. కుండ ఐస్ క్రీం, కప్ ఐస్ క్రీం, కోన్ ఐస్ క్రీం, కుల్ఫీ, బకెట్ ఐస్ క్రీం ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ వ్యాపారి కొత్తరకం ఐస్ క్రీం ని తన కస్టమర్ల కోసం తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోని చూసిన వారంతా ఆ ఐస్ క్రీం ని చూసి ఇదేంది భయ్యా ఇలా ఉంది అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఓ హోటల్‌కి సంబంధించినది. కస్టమర్‌లను ఆకట్టుకునేలా వస్తువులు తయారు చేసినట్లు వీడియోలో చూడవచ్చు. ముఖ్యంగా ఐస్ క్రీం గురించి మాట్లాడితే చాలా భయంకరంగా తయారు చేశారు. అది చూసిన తర్వాత అందరూ ఖచ్చితంగా భయపడతారు. ఇక పిల్లల విషయానికొస్తే జీవితంలో ఐస్ క్రీం జోలికే రారు. ఇంతకీ ఆ ఐస్ క్రీం ఎలా ఉందంటే చిన్నపిల్లలకు దెబ్బలు తగిలి రక్తం వస్తున్నట్టు భయంకరమైన ముఖాలతో ఇక్కడ ఐస్ క్రీం ని తయారు చేశారు. ఈ వీడియోలో ఇచ్చిన క్యాప్షన్ ప్రకారం ఈ ప్రదేశం వుడ్స్ ఆఫ్ టెర్రర్, ఇది అమెరికాలోని నార్త్ కరోలినాలోని హాంటెడ్ హౌస్.
ఈ వీడియోని @creepycum అనే ఖాతా ద్వారా Instaలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోని చూసిన ఓ వ్యూవర్ ఇలా రాశారు, ‘ఈ దృశ్యం చాలా భయానకంగా ఉంది, దీంతో ఎవరినైనా భయపెట్టవచ్చు.’ మరొకరు, ‘మీరు కస్టమర్లను ఇలా భయపెడితే, వారు తిరిగి రారు’ అని కామెంట్ చేశారు. మరొక వినియోగదారు రాశారు, ‘కాన్సెప్ట్ సరైనది కానీ ఒకటి అంతగా భయపెట్టకూడదు.’ అని కామెంట్లు చేశారు.
Read More..
తెల్ల ఉల్లిపాయలతో ఆ సమస్యలను తగ్గించుకోవచ్చు!