Health Care

Diamond Necklace : కూతురి పెళ్లి కోసం చేయించిన డైమండ్ నెక్లెస్.. ఎక్కడ లభ్యమయ్యిందో తెలుసా?


దిశ,వెబ్‌డెస్క్: ఆభరణాలు ఆడవారికి అత్యంత ప్రీతికరమైనవి. నగలు నకిలీవి అయినా ఆడవారు ఎంతో ఇష్టంగా ధరిస్తారు. ఈ మధ్యకాలంలో నకిలీ నగలు కుడా బంగారంలా ధగ ధగ మెరిసిపోతున్నాయి. అయితే పెళ్లి పేరుతో అమ్మాయిలకు నగలు పెట్టడం ఒక ఆనవాయితీ. ఇదే క్రమంలో దేవరాజ్ అనే చెన్నైకి చెందిన వ్యక్తి తన కూతురి పెళ్లి కోసం రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చేయించాడు. చెత్తను పారవేస్తున్న సమయంలో పొరపాటున తన చేతిలో ఉన్న డైమండ్ నెక్లెస్‌ను చెత్త డబ్బాలోకి విసిరివేశాడు. ఆ నెక్లెస్ కాస్త చెత్త కుప్పలో పారిశుధ్య కార్మికులకు దర్శనమిచ్చింది.

నెక్లెస్ పోయిన విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన కుటుంబ సభ్యులు చెన్నై కార్పొరేషన్‌ సిబ్బందితో వెతికించారు. పారిశుధ్య కార్మికుల కృషి ఫలించి నెక్లెస్ లభ్యమైంది. దీంతో దేవరాజ్ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. సమస్యపై వెంటనే స్పందించి పారిశుధ్య కార్మికులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.



Source link

Related posts

జుట్టు అందంగా, పొడవుగా పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి

Oknews

ఆ డైరెక్టర్ మాట విని 100 కోట్లు పోగొట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్..

Oknews

నేడు ఛత్రపతి శివాజీ జయంతి

Oknews

Leave a Comment