ByGanesh
Tue 05th Mar 2024 10:05 AM
ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ ఇద్దరూ చిన్న డైరెక్టర్, చిన్న హీరోనే. కానీ హనుమాన్ చిత్రంతో వీరిద్దరూ మ్యాజిక్ చేసారు. సంక్రాంతికి బడా హీరోలతో, భారీ బడ్జెట్ మూవీస్ తో ఢీ కొట్టి గెలిచారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జని తక్కువ అంచనా వేసిన వారంతా హనుమాన్ చిత్రం చూసి తెల్ల మొహం వేశారు. తక్కువ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన విజువల్ వండర్ గా హనుమాన్ వచ్చేసరికి అందరికి నోట మాట రాలేదు. రిపీటెడ్ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. హనుమాన్ 300 కోట్ల క్లబ్బులో కి వెళ్ళడానికి ప్రేక్షకులే కారణమయ్యారు.
మరి ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ ని హనుమాన్ క్లైమాక్స్ లోనే ప్రకటించారు. జై హనుమాన్ స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రశాంత్ వర్మ మొదలు పెట్టేసాడు. ఈ చిత్రంలో ఇప్పుడు స్టార్ హీరో రాబోతున్నాడు. జై హనుమాన్ గా ఎవరు నటిస్తారో అంటూ రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. నిన్నగాక మొన్న హనుమాన్ 50 డేస్ ఫంక్షన్ లో దర్శకుడు ప్రశాంత్ వర్మ మాటలు జై హనుమాన్ పై మరింతగా అంచనాలు పెంచేసాయి.
అయితే జై హనుమాన్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఏప్రిల్ 17 శ్రీరామనవమికి జై హనుమాన్ ఫస్ట్ లుక్ వదలాలనే ప్లాన్ లో ఉన్నట్లుగా టాక్. ప్యాన్ ఇండియా ఫిల్మ్ గా జై హనుమాన్ ని వచ్చే ఏడాది అంటే 2025 సంక్రాంతికి అంటూ ప్రశాంత్ వర్మ అందరి కన్నా ముందే తన చిత్రాన్ని పండగ బరిలోకి చేర్చేసాడు. ఇక జై హనుమాన్ ఫస్ట్ లుక్ ఖచ్చితంగా శ్రీరామనవమికి ఉండొచ్చని అంటున్నారు.
Did the audience appreciate the good movies?:
Operation Valentine mvie result