Sports

Dinesh Karthik becomes second highest run getter in death overs of IPL since 2022


Dinesh Karthik becomes second highest run getter in death overs of IPL since 2022: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (RCB) ఆట‌గాడు దినేష్ కార్తీక్(Dinesh Karthik )  ఐపీఎల్ అరుదైన రికార్డు నెల‌కొల్పాడు. డెత్ ఓవ‌ర్ల లో అత్య‌ధిక స్ట్రైక్ రేట్ క‌లిగిన బ్యాట‌ర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఇప్పటి వరకు డెత్ ఓవ‌ర్ల‌లో అత‌ని స్ట్రైక్ రేట్ ఏకంగా 280 గా ఉండ‌డం విశేషం. అలాగే 203.27 స్ట్రైట్ రేట్‌తో 2022 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు డెత్ ఓవ‌ర్ల‌లో 372 ప‌రుగులు చేశాడు. ఇక అత్య‌ధిక ప‌రుగులు చేసిన వారిలో దినేష్ కార్తీక్ కంటే ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ బ్యాట‌ర్ షిమ్రాన్ హెట్మేయ‌ర్ ఉన్నారు.

ఆటాడించిన దినేష్:

సోమ‌వారం పంజాబ్ కింగ్స్‌తో చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ క్లాసిక్ ఇన్నింగ్స్‌కి తోడు చివ‌ర‌లో దినేష్ కార్తీక్‌, మ‌హిపాల్ లోమ్రోర్ కూడా  మెరుపులు మెరిపించ‌డంతో బెంగ‌ళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఇందులో దినేష్ కార్తీక్  10 బంతుల్లోనే 28 పరుగులు చేశాడు.  అతని ఖాతాలో మూడు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. దినేష్ కార్తీక్ ఒక సిక్స్, ఫోర్ కొట్టి (మధ్యలో ఒక వైడ్) రెండు బంతుల్లో మ్యాచ్ ముగించాడు. అంతే కాదు మరో వింతైన షాట్ కొట్టి  అందరి దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్ 20వ ఓవర్లో తుషార్ దేశ్ పాండే వేసిన బంతిని దినేష్ కార్తీక్ రివర్స్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ, బంతి బ్యాట్ దిగువకు తగిలి నేరుగా లెగ్ సైట్‌లోని బౌండరీ లైన్‌ను దాటింది. దీంతో అసలు  దినేష్ కార్తీక్ ఏ షాట్ కొట్టాడనే విషయంపై వ్యాఖ్యాతలు కూడా  కాసేపు అయోమయంలో పడ్డారు. ఇలాంటి షాట్ క్రికెట్ బుక్‌లో లేదంటూ కామెంట్ చేశారు.  దినేష్ కార్తీక్ ఫస్ట్ మ్యాచులో కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 26 బంతుల్లో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచి ఆర్సీబీ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 

కోహ్లీ కూడా తగ్గేదేలే :

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు కింగ్‌ కోహ్లీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ 20 కెరీర్‌లో వందో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో… కోహ్లీ ఈ ఘనత సాధించాడు. టీ20ల్లో 100 హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ నిలిచాడు. టీ20ల్లో 100వ సారి 50 పరుగుల మార్కును దాటిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి టీ20లో 12 వేల పరుగులను అధిగమించాడు. టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అరుదైన రికార్డు సాధించాడు.

ఐపీఎల్ 2024(IPL)లో తొలి మ్యాచులో ఆరు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. టీ20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా నిలిచాడు. మొత్తంగా టీ20ల్లో 12000 పరుగులు చేసిన నాలుగో ప్లేయర్ విరాట్. టీ20 కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసి ఆటగాడిగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఉన్నాడు. గేల్ 14,562 ప‌రుగులు చేశాడు. తర్వాత పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండ‌ర్ షోయ‌బ్ మాలిక్ 12,993 పరుగులు, కీర‌న్ పోలార్డ్ 12,430 పరుగులతో మూడో స్థానంలో ఉన్నారు. కోహ్లీ నాలుగో స్థానంలో నిలిచాడు.  

మరిన్ని చూడండి



Source link

Related posts

Axar Patel the Jayasuriya of Nadiad makes years of perfecting his cricket count in World Cup final | Axar Patel: శ్రీలంకకు ఆ జయసూర్య, భారత్‌కు ఈ జయసూర్య

Oknews

ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్లోనే రఫేల్ నదాల్‌కు గట్టి ప్రత్యర్థి.. ఛాంపియన్ ప్లేయర్‌కు సవాలే-tennis news in telugu french open 2024 draw rafael nadal to face fourth seed alexander zwerev in the first round ,స్పోర్ట్స్ న్యూస్

Oknews

Ind vs Eng 5th Test Highlights: ఇన్నింగ్స్ ఓటమితో పరాభవాన్ని మూటగట్టుకున్న ఇంగ్లండ్ జట్టు

Oknews

Leave a Comment