Entertainment

director-krish-tested-corona-positive – Telugu Shortheadlines


డైరక్టర్ క్రిష్‌కు కరోనాపాజిటివ్

తెలుగు సినీ రంగంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. మొన్న రాంచరణ్, వరుణ్ తేజ్ కరోనా బారీన పడగా తాజాగా ప్రముఖ దర్శకుడు క్రిష్ కరోనా (Krish Tests Positive for COVID-19) బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. తాను (Krish Jagarlamudi) హోం క్వారంటైన్ లో ఉన్నట్టు తెలిపారు. క్రిష్… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాల్సి ఉండడంతో షూటింగ్ కు వెళ్లే ముందు ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది.

వాస్తవానికి ఈ నెల 4 నుంచి చిత్రీకరణ షురూ చేయాలని చిత్రబృందం భావించింది. ఇటీవలే వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్… క్రిష్ తో సినిమా కోసం సన్నద్ధమయ్యారు. ఇంతలో క్రిష్ కరోనా బారినపడడంతో షూటింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది తెలియాల్సి ఉంది. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రం ఓ పీరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. విరూపాక్ష అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పవన్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని ప్రచారం జరుగుతోంది.

ఇటీవ‌లే వకీల్ సాబ్ షూటింగ్‌ని పూర్తి చేసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ త్వరలోనే క్రిష్‌ మూవీలో నటించేందుకు సిద్ధమయ్యాడు. అయితే క్రిష్‌కు కరోనా అని తేలడంతో అతను కోలుకున్న అనంతరం పవన్‌ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నాడు. ఇదిలా ఉండగా ప‌వ‌న్, వ‌కీల్ సాబ్ షూటింగ్‌లో ఉన్న స‌మ‌యంలో క్రిష్.. వైష్ణ‌వ్ తేజ్‌తో ఓ మూవీని తెర‌కెక్కించారు. 40 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ని పూర్తి చేశాడు. ఇప్పటికే తెలుగు చిత్రసీమలు చాలామంది హీరోలు డైరక్టర్లు కరోనా బారీన పడ్డారు. రాజమౌళి, చిరంజీవి, నాగబాబు కరోనా నుంచి కోలుకుని బయటపడిన విషయం విదితమే. 

 



Source link

Related posts

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్.. భయపడుతున్న రామ్ చరణ్ ఫ్యాన్స్..!

Oknews

వేరే లెవెల్ లో 'అఖండ-2'.. పాన్ ఇండియా షేక్ అవ్వాల్సిందే!

Oknews

తెలుగు రాష్ట్రాల్లో దేవర బిజినెస్.. కల్కిని క్రాస్ చేస్తుందా 

Oknews

Leave a Comment