ByGanesh
Tue 05th Mar 2024 05:44 PM
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మహానటి దర్శకుడు తెరకెక్కిస్తున్న కల్కి 2898 AD చిత్రంపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. మే 9 న కల్కి రిలీజ్ అంటూ మేకర్స్ చెప్పినప్పటినుంచి ప్రభాస్ ఫాన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఈమధ్యన కల్కి మే 9 నుంచి పోస్ట్ పోన్ అవ్వుద్ది అనే వార్తలకి మేకర్స్ చెక్ చెప్పారు. ఈ చిత్రంలో ప్రభాస్ తో దీపికా పదుకొనె, దిశా పఠానీలు రొమాన్స్ చేస్తున్నారు. అమితాబ్, కమల్ హాసన్ లు కల్కి లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రస్తుతం కల్కి 2898 AD చిత్రం షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఇటలీలో సార్దీనియా ద్వీపంలో ప్రభాస్ – దిశా పటాని లపై నాగ్ అశ్విన్ రొమాంటిక్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. సార్దీనియా ద్వీపంలోని అద్భుతమైన లొకేషన్స్ లో, బీచ్ ఒడ్డున ప్రభాస్-దిశలపై ఈ పాటని చిత్రీకరిస్తున్నారట. ఈ పాట సినిమా హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తుంది అంటున్నారు.
కల్కి కథ గతంలో అంటే మహాభారతం కాలంలో మొదలై 2898 కి ముగుస్తుంది అందుకే ఈ చిత్రానికి కల్కి 2898 AD టైటిల్ పెట్టినట్లుగా నాగ్ అశ్విన్ రీసెంట్ గానే రివీల్ చేసారు.
Disha Patani romantic song with Prabhas:
Kalki 2098 AD: Romantic Song With Prabhas Disha Patani Shooting In Italy