Sports

Eccentric Genius Ravichandran Ashwin Reaches Another Milestone


Eccentric genius Ravichandran Ashwin: రవిచంద్రన్‌ అశ్విన్‌ ఓ క్రికెట్‌ మేధావి. బ్యాటర్లు ఆడే షాట్‌ను ముందే ఊహించి దానికి తగ్గట్లుగా బౌలింగ్‌ను మార్చుకుని వికెట్లను తీసే మేధావి. అందుకే టీమిండియా హెడ్‌కోచ్‌ ద్రావిడ్‌ కూడా తాను అశ్విన్‌లా క్రికెట్‌ మేధావిగా ఆలోచించాల్సి వస్తుందని ఓసారి వ్యాఖ్యానించాడు. జట్టు కోసం ఏ త్యాగానికైనా.. ఎంతటి కష్టానికైనా అశ్విన్‌ సిద్ధంగా ఉంటాడు. వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్లను కకావికలం చేసి టీమిండియాకు విజయం సాధించిపెట్టగల ధీరుడు. జట్టుకు వికెట్‌ అవసరమైన ప్రతీసారి కెప్టెన్‌ చూపు అశ్విన్‌ వైపే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మైదానంలోనూ అశ్విన్‌ అగ్రెసివ్‌గానే ఉంటాడు. మన్కడింగ్‌ ద్వారా బ్యాటర్‌ను అవుట్‌ చేసి… అది తప్పైతే నిబంధనల పుస్తకంలో ఎందుకు ఉందంటూ ధైర్యంగా అడిగే క్రికెటర్‌ అశ్విన్‌. అందుకే అంతర్జాకీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి 12 ఏళ్లు దాటినా ఈ స్పిన్ మాంత్రికుడు.. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను వణికిస్తూనే ఉన్నాడు. 

 

సుదీర్ఘ కెరీర్‌

2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన అశ్విన్ అప్పటినుంచి టీమిండియాలో కీలక బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అషూ.. టాపార్డర్ బ్యాటర్‌గా తన క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించి తర్వాత స్పిన్నర్‌గా మారిపోయాడు. కుంబ్లే, హర్భజన్ సింగ్ యుగం తరువాత, అశ్విన్ మంచి స్పిన్నర్ గా రాణించాడు. తన మొదటి 16 టెస్టుల్లో అశ్విన్ తొమ్మిదిసార్లు ఐదు వికెట్లు తీసి అత్యంత వేగంగా 300 వికెట్ల క్లబ్‌లో చేరిన ఆటగాడిగా నిలిచాడు. తొలి మూడేళ్లలో అతను 23 టెస్టుల్లో 114 వికెట్లు పడగొట్టాడు. 2015 జనవరి నుంచి స్వదేశంలో 43 టెస్టుల్లో 252 వికెట్లు, విదేశాల్లో 32 టెస్టుల్లో 134 వికెట్లు సాధించాడు. భారత్‌లో అయితే అతనికి తిరుగేలేదు. 56 టెస్టుల్లో 347 వికెట్లు పడగొట్టాడు.సొంతగడ్డపై అతనాడిన 57 టెస్టుల్లో భారత్‌ 42 గెలిచింది. ఓవరాల్‌గా 97 టెస్టుల్లో 56 విజయాలు సాధించింది. 10 సార్లు అతను ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు. 2015 జనవరి నుంచి స్వదేశంలో 43 టెస్టుల్లో 252 వికెట్లు, విదేశాల్లో 32 టెస్టుల్లో 134 వికెట్లు సాధించాడు. భారత్‌లో అయితే అతనికి తిరుగేలేదు. 56 టెస్టుల్లో 347 వికెట్లు పడగొట్టాడు.

 

మూడో టెస్ట్‌ నుంచి వైదొలిగిన అశ్విన్‌

రాజ్‌కోట్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తల్లి అనారోగ్యం కారణంగా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌… మ్యాచ్‌ మధ్య నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అతడికి జట్టుతో పాటు బోర్డు అండగా నిలుస్తుందని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు అశ్విన్‌ చెన్నైకి వెళ్లినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ విషయాన్ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ట్వీట్‌ చేశారు. అశ్విన్‌ తల్లి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానట్లు శుక్లా ట్వీట్‌ చేశారు. 

 

అశ్విన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించిన బీసీసీఐ… ఆటగాళ్ళ సంబంధికుల ఆరోగ్యం, శ్రేయస్సు చాలా ముఖ్యమైనదని ట్వీట్‌లో పేర్కొంది. మిగిలిన రెండు టెస్టులకు కూడా అశ్విన్‌ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అశ్విన్‌ స్థానంలో పుల్కిత్ నారంగ్‌, జయంత్ యాదవ్, జలజ్ సక్సేనాలలో ఒకరికి స్థానం దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. 



Source link

Related posts

Brisbane Heat Crush Sydney Sixers To Win Australias Big Bash League Final

Oknews

Novak Djokovic Defeats Taylor Fritz To Reach 11th Australian Open Semifinal

Oknews

Jasprit Bumrah Bowling T20 World Cup 2024 | Jasprit Bumrah Bowling

Oknews

Leave a Comment