Latest NewsTelangana

election of rajya sabha candidates in telangana is unanimous | Rajyasabha Election: తెలంగాణ మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం


Telangana Rajya Sabha Candidates is Unanimous: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం సాయంత్రం ముగిసింది. రాష్ట్రంలో 3 స్థానాలకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్ఎస్ నుంచి ఒకరు బరిలో నిలవగా.. ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే శ్రమజీవి పార్టీ తరఫున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ లు నామినేషన్లు ఇచ్చారు. అయితే, రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు మినహా మిగిలిన ముగ్గురికీ మద్దతుగా ఎమ్మెల్యేలెవరూ సంతకాలు చేయలేదు. ఈ క్రమంలో ఆ ముగ్గురి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించనున్నారు.

Also Read: Telangana Politics : తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య చిచ్చు పెట్టిన బెంజ్ కారు – అసలు విషయమేమిటంటే ?

మరిన్ని చూడండి



Source link

Related posts

Telangana Elections 2023: Minister Harish Rao Fire On Congress Over To Complaint On Rythu Bandhu | Harish Rao: కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్, 3 గంటలే కరెంటు

Oknews

టీ గ్లాస్ తో తుఫాన్ సృష్టించడానికి వస్తున్న పవర్ స్టార్!

Oknews

pm modi slams brs and congress in jagitial bjp vijaya sankalpa sabha | PM Modi: ‘బీఆర్ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుంది’

Oknews

Leave a Comment