డిఫెండింగ్ చాంపియన్స్ ఇంగ్లండ్ మీద సౌతాఫ్రికా 229 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 400 పరుగుల టార్గెట్ చేజింగ్ లో ఇంగ్లండ్ బ్యాటర్లందరూ షుగర్ ఉన్నట్టు పెవిలియన్ కు క్యూ కట్టారే తప్ప, రెండు వికెట్లు పడ్డ తర్వాత కనీసం ప్లాన్ బీ అమలు చేయాలన్న ఆలోచనే రాలేదు. 84 పరుగులకే 7 వికెట్లు పోయాయి. అయినా సరే 170 దాకా లాక్కొచ్చి నెట్ రన్ రేట్ మరీ తగ్గిపోకుండా చూసుకున్నారు.