Sports

Faf du Plessis heaps praises on Jasprit Bumrah after his brilliant 5 fer helps MI stun RCB in IPL 2024


Faf du Plessis heaps praises on Jasprit Bumrah: ఐపీఎల్‌(IPL)  వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు(RCB)పై ముంబై ఇండియన్స్‌(MI) ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం… మూడే పరుగులు చేసి వెనుదిరిగాడు. బెంగళూరు సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, రజత్‌ పటిదార్‌, దినేశ్‌ కార్తీక్ అర్ధ శతకాలతో మెరిశారు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ రాణించగా… సూర్యకుమార్‌ యాదవ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ముంబైకు ఘన విజయాన్ని కట్టపెట్టాడు. ఇషాన్‌ కిషన్‌ 69, రోహిత్‌ శర్మ 38 పరుగులు చేశారు. సూర్యకుమార్‌ యాదవ్‌  కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్‌ అనంతరం బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

 

జీర్ణించుకోవడం కష్టం

మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఫాఫ్ డుప్లెసిస్ నిర్వేదం వ్యక్తం చేశాడు.  టాస్ ఓడిపోవడం నుంచి బ్యాటింగ్, బౌలింగ్‌లో ఏదీ తదకు కలిసిరాలేదన్నాడు. 250 పరుగులు చేయాల్సిన పిచ్‌పై 196 పరుగులు మాత్రమే చేయడంతో ఘోర పరాజయం తప్పలేదన్నాడు.  ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టమన్న డుప్లెసిస్‌… మంచు కూడా తమ అవకాశాలను దెబ్బతీసిందని తెలిపాడు. తాను, పటీదార్ మంచి భాగస్వామ్యం నెలకొల్పినా తమను బుమ్రా(Jasprit Bumrah) దారుణంగా దెబ్బతీశాడని డుప్లెసిస్‌ తెలిపాడు. బుమ్రా బంతిని అందుకున్న ప్రతీసారి తమను దెబ్బకొట్టాడని అన్నాడు. తీవ్ర ఒత్తిడిలోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేయగలడని… మలింగా మార్గనిర్దేశంలో బుమ్రా మరింత రాటుదేలాడని డుప్లెసిస్‌ తెలిపాడు. బుమ్రా లాంటి బౌలర్‌ తమ జట్టులో ఉంటే బాగుండేదని తెలిపాడు. తమ బౌలింగ్ బలహీనమనే విషయం తెలిసిందేనని… భారీ స్కోర్లు చేస్తేనే విజయాలు అందుకోగలుగుతామని బెంగళూరు కెప్టెన్‌ తెలిపాడు. 

 

బుమ్రా రికార్డు

బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. బెంగళూరు బ్యాటర్లు కుదురుకున్న ప్రతీసారి వికెట్‌ తీసిన బుమ్రా.. బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బెంగళూరు బ్యాటర్లను కట్టడి చేశాడు.  ఈ మ్యాచ్‌లో(5/21) ఐదు వికెట్లతో నిప్పులు చెరిగిన బుమ్రా.. ఆర్‌సీబీ పతనాన్ని శాసించడంతో పాటు పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అయిదు వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై వర్సెస్ ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు.

మరిన్ని చూడండి



Source link

Related posts

కివీస్ నే కొట్టిన కాబూలీలు..ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందే

Oknews

Rohit Sharma Warns Sarfaraz Khan About Helmet

Oknews

LSG vs DC IPL 2024 Head to Head records

Oknews

Leave a Comment