ByMohan
Tue 30th Jan 2024 08:16 AM
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం దేవర. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలున్నాయో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్, ఆచార్య తర్వాత కొరటాల శివ చేస్తున్న ఈ దేవర నుండి వస్తోన్న ఒక్కో అప్‌డేట్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు తారక్ చేయనటువంటి పాత్రను ఇందులో చేస్తున్నట్లుగానూ, ఊచకోతకి అర్థం ఏంటో చెప్పబోతున్నట్లుగా.. దేవర విషయంలో వినిపిస్తూ వస్తుంది. అందుకే మొదట ఒక పార్ట్ అనుకున్న ఈ సినిమాను రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నట్లు స్వయంగా కొరటాలే తెలిపారు.
మొదటి పార్ట్‌ను 2024, ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని రోజులుగా ఈ సినిమా ఆ డేట్‌కి వచ్చే అవకాశం లేదనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదే మాట తాజాగా దిల్ రాజు నోటి వెంట కూడా రావడంతో.. దేవర ఆగమనం ఆ డేట్‌కి కాదనేలా కొందరు ఫిక్స్ అవుతున్నారు. అయితే దేవర ఆ తేదీకి రాకపోతే మాత్రం.. మరో స్టార్ వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా దిల్ రాజు సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఇప్పటికే విడుదలై ఉండాలి. కానీ, ఆ సినిమా షూటింగ్ విషయంలో కొన్ని అంతరాయాలు ఏర్పడ్డాయి. దీంతో వాయిదా వేయాల్సి వచ్చింది. ఇది దిల్ రాజు నిర్మిస్తోన్న సినిమా. అందుకే, దేవర డేట్‌ని ఈ సినిమాకు ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. సోమవారం జరిగిన మీడియా మీట్‌లో ఫ్యామిలీ స్టార్ గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. ఒకవేళ దేవర చిత్రం కనుక వాయిదా పడితే మాత్రం.. ఆ డేట్‌కి ఫ్యామిలీ స్టార్ సినిమా వస్తుంది. దేవర కనుక సేమ్ డేట్‌కి వచ్చే లెక్కయితే మేము వేరే తేదీకి వెళ్తాం.. అని చెప్పుకొచ్చాడు. సో.. దిల్ రాజు నోటి నుండే వాయిదా అనే మాట వచ్చింది కాబట్టి.. దేవర ఆ డేట్‌కి డౌట్ అనే చెప్పుకోవాలి. చూద్దాం.. ఫ్యామిలీ స్టార్‌కి దేవర దారిస్తాడో.. లేదో..!
Family Star Wants Devara Release Date:
Dil Raju About Devara and Family Star Release