ByMohan
Mon 29th Jan 2024 10:57 PM
టాలీవుడ్ అగ్రగామి సంస్థలలో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చాలా తెలివిగా అడుగులు వేస్తోంది. ఒకవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే.. మరోవైపు స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్‌తో మంచి సక్సెస్‌లను అందుకుంటోంది. అందులోనూ ఈ మధ్య చిన్న సినిమాలు సక్సెస్ అయితే కోట్ల వర్షం కురుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు ఒక పట్టాన సెట్స్‌కి రావు. ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, మధ్యలో ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చి షూటింగ్స్ ఆగిపోవడం.. ఇలాంటి తలనొప్పులకు కాస్త ఉపశమనం ఏంటయ్యా అంటే.. స్మాల్ బడ్జెట్ సినిమాలే. అదే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చేస్తోంది.
ఒకవేళ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ సరిగా ఆడకపోయినా.. పెద్దగా లాస్ రాదు. ఒకవేళ అన్ని సరిగ్గా కుదిరితే మాత్రం కోట్లు కుమ్మరిస్తాయి. ఈ ఫెసిలిటి ఉంది కాబట్టే.. రెండు మూడు పెద్ద సినిమాలు చేస్తూనే మధ్యమధ్యలో స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్‌ని సితార ఎంకరేజ్ చేస్తోంది. అలా చేసిన మ్యాడ్ చిత్రం.. సితారకు మంచి సక్సెస్‌ని రుచి చూపించింది. ఇప్పుడదే బాటలో మరో స్మాల్ బడ్జెట్ ఫిల్మ్‌ని వేసవికి వదిలేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రెడీ చేస్తోంది. ఆ సినిమానే మ్యాజిక్.
జెర్సీ వంటి క్లాసికల్ ఫిల్మ్‌ని రూపొందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో టీనేజ్ డ్రామాగా మ్యాజిక్ తెరకెక్కుతోంది. సితారలో విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి ఓ సినిమా కమిటై ఉన్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వేరే కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉండటంతో.. ఈ గ్యాప్‌లో మ్యాజిక్‌ని రెడీ చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని 2024 వేసవిలో తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
విశేషం ఏమిటంటే.. పలువురు కొత్తవారు ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించడం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ తెలియజేయనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సాయి సౌజన్యతో కలిసి సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది.
Gowtham Tinnanuri Musical Teenage Drama Magic:
After MAD.. Sithara Entertainments Ready to Give Magic for Audience