Sports

GT vs SRH IPL 2024 Match Head to Head records


GT vs SRH IPL 2024 Match Head to Head records: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర సమరం జరగనుంది. ఐపీఎల్‌ మ్యాచ్‌ నెంబర్‌ 12లో గుజరాత్ టైటాన్స్-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. మధ్యాహ్నం మూడున్నరకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ 2024 పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్… మొదటి రెండు మ్యాచుల్లో ఒకటి గెలిచి.. మరోటి ఓడి 2 పాయింట్లతో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరోటి ఓడి 2 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉంది. ఇరు జట్లకు రెండు పాయింట్లే ఉన్నా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉంది. 

గుజరాత్‌దే పైచేయి
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అరంగేట్రం చేసింది. అప్పటి నుంచి హైదరాబాద్‌-గుజరాత్‌ మూడుసార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, ఒక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచాయి. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్‌పై హైదరాబాద్ ఒక్క విజయం మాత్రమే సాధించింది. 

పిచ్‌ రిపోర్ట్‌
ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం జరగనుండడంతో స్పిన్నర్లు రషీద్, సాయి కిషోర్ కీలకంగా మారనున్నారు. అహ్మదాబాద్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించే వీలుంది. బ్యాటర్లు ఓపిగ్గా నిలబడితే భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గుజరాత్‌ బౌలింగ్‌ కాస్త బలహీనంగా ఉండడంతో తొలి బ్యాటింగ్‌ హైదరాబాద్‌ది అయితే భారీ స్కోరు నమోదు కావచ్చు. ముంబైతో పోలిస్తే బలహీనంగా ఉన్న గుజారాత్‌ బౌలింగ్‌ దళం… హైదరాబాద్‌ బ్యాటర్లను అడ్డుకోగలదా అన్నదే ఇప్పుడు అందిరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. 

జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ మింజ్, కేన్ విలియమ్సన్, అభినవ్ మంధర్, సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, శాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, మానవ్ సుతార్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, ట్రావిస్ హెడ్, వనిందు హసరంగా, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతావేద్ సుబ్రమణ్యన్.

మరిన్ని చూడండి



Source link

Related posts

WPL RCB Victory Gujarat Giants Smriti Mandhana Attacking Innings

Oknews

IND Vs ENG Spotlight On Patidar Sarfaraz And Other Additions For Second Test

Oknews

ICC U19 Mens Cricket World Cup 2024 Team Of The Tournament Revealed

Oknews

Leave a Comment