Latest NewsTelangana

Harish Rao slams Congress and BJP over BRS MLC Kavitha Arrest


Harish Rao about BRS MLC Kavitha Arrest: హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత అరెస్టు అక్రమం, అప్రజాస్వామికం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. శని ఆదివారాలు కోర్టుకు సెలవులు అని, కావాలనే శుక్రవారం రోజు కవితను పథకం ప్రకారం అరెస్ట్ చేశారని ఆరోపించారు. కవిత అరెస్ట్ అనంతరం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అనేక సార్లు కవితను అరెస్టు చేస్తామని బీజేపీ నేతలు చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కవితను అరెస్టు చేశారు. 

కవిత అరెస్టుపై న్యాయపోరాటం చేస్తాం
కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీని డిమోరలైజ్ చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్నాయని హరీష్ రావు ఆరోపించారు. కుట్రలు ఎదుర్కోవడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తకాదని, కవిత అరెస్టుపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కవిత అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఎందుకంటే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీకి సుప్రీంకోర్టు చెప్పింది. రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా ఒకరోజు ముందు కవితను అరెస్ట్ చేశారు. మార్చి 19 వ తేదీన సుప్రీం కోర్టులో వాదనలు ఉంటే హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. 

బీజేపీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది
‘కేంద్రం పాలన ఎమర్జెన్సీని తలపిస్తోంది. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం బీజేపీ చేసింది. కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేయాలని పిలుపునిచ్చాం. కాంగ్రెస్, బీజేపీల కుమ్మక్కు కవిత అరెస్టుతో అర్ధం అయింది. ముందు సెర్చ్ అని వచ్చి, ఆ తర్వాత అరెస్టు అన్నారు, ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటమి తప్పదు. ఉద్యమాలు మాకు కొత్త కాదు, కవిత అరెస్ట్ ముందే ప్లాన్ ఉంది. ముందే ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని అధికారులు వచ్చారని’ హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు.

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి…
‘కవిత అరెస్టులో రాజకీయ కుట్రకోణం దాగి ఉంది. ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవిత అన్నీ ఆధారాలు ఇచ్చారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను జేబు సంస్థలుగా మార్చుకుంది. మహిళలకు పి.ఎల్.ఎం.ఎ యాక్ట్ లో మినహాయింపు ఉండాలని చెప్పింది. రాజకీయ ప్రత్యర్ధులను లొంగదీసుకోవడానికి బీజేపీ కుట్రలు చేస్తోంది. ఢిల్లీ నుండి వచ్చినప్పుడే కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకుని వచ్చారు. ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు ఇవ్వడం.. వారు బీజేపీలో చేరగానే కేసులు లేకుండా చేస్తున్నారు. బీజేపీకి రాజకీయంగా కేసీఆర్ లొంగలేదు కాబట్టి కవితను అరెస్టు చేశారని’ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

Chaitu who escaped from Plop ప్లాప్ నుంచి ఎస్కేప్ అయిన చైతు

Oknews

Hyderabad News Telangana Aviation Academy MoU with ISROs National Remote Sensing Center | Drone Port: హైదరాబాద్ లో కొత్తగా డ్రోన్ పోర్ట్, ఇస్రోతో ఒప్పందం

Oknews

How can we forget that Revanth is CM! సారూ.. రేవంత్ సీఎం అని మరిస్తే ఎలా!

Oknews

Leave a Comment