ByGanesh
Wed 27th Mar 2024 03:07 PM
గత కొన్ని రోజులుగా కోలీవుడ్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీలు డేటింగ్‌లో ఉన్నారనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. వారి రిలేషన్‌పై ఎప్పటికప్పుడు వార్తలు, ఫొటోలు బయటికి వస్తూనే ఉన్నాయి. మహాసముద్రం సినిమాకు కలిసి పనిచేసిన ఈ ఇద్దరూ.. అప్పటి నుండి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. హీరో శర్వానంద్ పెళ్ళికి ఇద్దరూ కలిసి వెళ్లడం కూడా వీరి రిలేషన్‌పై వార్తలు వైరల్ అయ్యేలా చేసింది. అయితే సిద్దు-అదితి తమ బంధాన్ని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్లి, మూడు ముళ్ల బంధంగా మార్చుకున్నట్లుగా తెలుస్తోంది.
సిద్దార్థ్, అదితి రావు హైదరి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆరేడు నెలల నుంచి సిద్దార్థ్- అదితిరావు హైదరీ సహజీవనం చేస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఈ జంట పెళ్లి చేసుకుని ఒకటయ్యారని సమాచారం. వీరి రహస్య వివాహానికి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. సిద్దు-అదితిలు తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురం గ్రామంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో బుధవారం ఉదయం రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్త.
సీక్రెట్‌గా జరిగిన సిద్దార్థ్-అదితిల పెళ్లికి మీడియాతో పాటు ఆలయ సిబ్బందికి కూడా అనుమతిలేదని తెలుస్తోంది. ఈ పెళ్లికి వీరిద్దరికీ చాలా దగ్గరైన వారు మాత్రమే హాజరైనట్లుగా సమాచారం. ఈ వివాహానికి సంబంధించి సిద్దార్థ్, అదితిల నుంచి ఇంత వరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.
Hero Siddharth and Heroine Aditi Rao Hydari Secretly Married:
Siddharth and Aditi Rao Hydari Marriage News Goes Viral