GossipsLatest News

High Court Big Shock To Actor Navdeep నవదీప్ కి కోర్టు బిగ్ షాక్



Wed 20th Sep 2023 03:01 PM

navdeep  నవదీప్ కి కోర్టు బిగ్ షాక్


High Court Big Shock To Actor Navdeep నవదీప్ కి కోర్టు బిగ్ షాక్

హీరో నవదీప్ తాజాగా మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ డ్రగ్స్ కేసులో బాగా ఇరుక్కుపోయాడు. అంతకుముందు డ్రగ్స్ కేసు విచారణకు హాజరైతేనే సినిమా ఇండస్ట్రీలో నవదీప్ పేరు డ్యామేజ్ అయితే.. ఇప్పుడు ఈ కేసులో నవదీప్ నార్కోటిక్ పోలీసులకి దొరక్కుండా పారిపోయాడంటూ పోలీసులు చెప్పడం నవదీప్ ని మరింత ఇరకాటంలో పెట్టింది. తాను పారిపోలేదు అంటూ చెబుతూనే నవదీప్ ఈ కేసులో తనని అరెస్ట్ చెయ్యకుండా కోర్టులో పిటిషన్ వేసాడు. ఇక కోర్టు కూడా నవదీప్ ని కొద్దిరోజులు అరెస్ట్ చేయ్యొద్దు అని చెప్పింది. 

కానీ నార్కోటిక్ పోలీసులు నవదీప్ డ్రగ్స్ సేవించడమే కాకుండా, డ్రగ్స్ విక్రయించాడంటూ నవదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించి నోటీసులు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. తాజాగా కోర్టులో నవదీప్ తరపు న్యాయవాది ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు నవదీప్ కి నోటీసులు పంపించమని పోలీసులని ఆదేశించింది. 

నవదీప్ గతంలోనూ డ్రగ్స్ కేసులో నిందితుడుగా పలుమార్లు విచారణకు హాజరయ్యాడని నార్కెటిక్ పోలీసుల తరపు న్యాయవాది వాధించగా.. నవదీప్ లాయర్ ఎన్నిసార్లు విచారణకు వెళ్లినా నవదీప్ ని నిందితుడిగా తేల్చలేదు, మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కి ఎలాంటి సంబంధం లేదు అంటూ విధించినప్పటికీ.. కోర్టు మాత్రం ఈ మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కి నోటీసులు ఇచ్చి విచారించమని పోలీసులని ఆదేశించడం నిజంగా నవదీప్ కి బిగ్ షాకే. 


High Court Big Shock To Actor Navdeep:

Telangana High Court Big Shock To Actor Navdeep









Source link

Related posts

Mokshagna Warning To His Father Balakrishna మోక్షజ్ఞ నిజంగా అంతమాటన్నాడా?

Oknews

డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్‌.. పరారీలో రకుల్ ప్రీత్ సింగ్!

Oknews

Kiran Rao never really fought with Aamir Khan గొడవల్లేకుండా విడాకులెందుకు తీసుకున్నట్లు

Oknews

Leave a Comment