Entertainment

high court instructed police to arrest sarathkumar and radha ravi


శరత్‌కుమార్‌ అరెస్టు చేయండి: హైకోర్టు

ప్రముఖ నటులు శరత్‌కుమార్‌ మరియు రాధారవి అరెస్టుకు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో సినీ నటీనటుల సంఘానికి శరత్‌కుమార్‌ అధ్యక్షుడిగా, రాధారవి కార్యదర్శిగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ఆ కాలంలో కాంచీపురం జిల్లా పరిధిలోని వెంకటామంగళంలో ఉన్న నడిగర్‌ సంఘానికి చెందిన స్థలాన్ని వీరిద్దరు అక్రమంగా అమ్మారని 2017లో ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు శనివారం విచారించింది. సంఘం అనుమతి లేకుండా స్థలాన్ని విక్రయించిన ఈ కేసును 3నెలల్లో తేల్చి తగిన చర్యలు తీసుకోవాలని, శరత్, రవిలను అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించింది.

 



Source link

Related posts

హీరో కార్తీ సినిమా షూటింగ్ లో ప్రమాదం.. 20 అడుగుల ఎత్తు నుండి కిందపడి మృతి!

Oknews

ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి వ్యూస్‌ సాధించిన ‘ఆ కుర్చీని మడత పెట్టి..’ సాంగ్‌!

Oknews

ఫ్యామిలీతో థాయ్‌లాండ్ కి ఎన్టీఆర్.. మరి 'దేవర' పరిస్థితి ఏంటి?

Oknews

Leave a Comment