Sports

Highest Wickets Takers in IPL 2008 to 2024


Highest wicket-takers in history of IPL History :  మరో 2 రోజుల్లో క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్న  ఐపీఎల్‌(IPL) మొదలు కానున్నాయి. మ్యాచ్ ల  కోసం భారత్‌లో కాలుమోపుతున్న దిగ్గజ క్రికెటర్లంతా తమ ప్రాంచైజీ ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. ఎవరికి వారు కచ్చితంగా కప్‌ ఎత్తుకెళ్లాలన్న కసితో వ్యూహాలు రచిస్తున్నారు. సాధారణంగా బ్యాటర్ల  విధ్వంసం కొనసాగే ఈ మ్యాచ్ లలో కొన్నిసార్లు బౌలర్లు తమ సత్తా చాటుతారు.  ఇప్పటివరకూ జరిగిన ఐపీఎల్‌లో  అదరగొట్టిన బౌలర్ల ప్రదర్శనలు తెలుసుకుందాం. 

వీరిలో  మొదటిగా చెప్పుకోవాల్సింది  యజ్వేంద్ర చాహల్‌(Yuzvendra Chahal) గురించి. ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 147 మ్యాచ్‌లు ఆడిన ఈ స్పిన్నర్‌ 187 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టాడు. చాహల్‌ బెస్ట్‌ 40 పరుగులకు అయిదు వికెట్లు. అసలు ఐపీఎల్‌ అంటే  ఠక్కున గుర్తు వచ్చే పేరు డ్వేన్‌ బ్రావో(Dwayne Bravo). ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 161 మ్యాచ్‌లు ఆడిన బ్రావో  183 వికెట్లు తీశాడు. ఇతని బెస్ట్‌ 22 పరుగులకు నాలుగు వికెట్లు. సాంప్రదాయ స్పిన్‌తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించగల మేధావి పీయూష్‌ చావ్లా(Piyush Chawla) ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 181 మ్యాచ్‌లు179 వికెట్లు తీసిన ఈ స్పిన్నర్ కెరీర్‌ బెస్ట్‌ 17 పరుగులకు నాలుగు వికెట్లు.  ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 161 మ్యాచ్‌లు ఆడిన స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా(Amit Mishra) తీసిన వికెట్లు 173 వికెట్లు  కాగా మిశ్రా బెస్ట్‌ 17 పరుగులకు అయిదు వికెట్లు.

 మన భారతీయ ఆటగాడు, క్రికెట్‌ మేధావిగా పేరుగాంచిన అశ్విన్‌(Ravichandran Ashwin)… ప్రత్యర్థిని తన ఉచ్చులో బిగించి అవుట్‌ చేయడంలో నేర్పరి. ఇటీవలే టెస్టుల్లో 500 వికెట్లు మైలురాయిని  చేరుకున్న విషయం తెలిసిందే ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 197 మ్యాచ్‌లు ఆడిన  అశ్విన్‌ 171 వికెట్లు తీసి సత్తా చాటాడు. అశ్విన్‌ బెస్ట్‌ 34 పరుగులకు నాలుగు వికెట్లు. తరువాత 22 మ్యాచ్‌లు ఆడిన మలింగ(Lasith Malinga)  170 వికెట్లు తీసి సత్తా చాటాడు.  ఇతని బెస్ట్‌ 13 పరుగులకు అయిదు వికెట్లు. స్వింగ్‌ కింగ్‌గా పేరుగాంచిన భువనేశ్వర్‌ కుమార్‌(Bhuvneshwar Kumar ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 160 మ్యాచ్‌లు ఆది  170 వికెట్లు తీశాడు. భువీ బెస్ట్‌ 19 పరుగులకు అయిదు వికెట్లు.  ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 162 మ్యాచ్‌లు ఆడిన స్పిన్నర్‌ సునీల్‌ నరైన్(Sunil Narine) 163 వికెట్లు తరువాత జడేజా  226 మ్యాచ్‌లు ఆడిన 152 వికెట్లు తీసి సత్తా చాటాడు. తన స్పిన్‌ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లను ముప్పు తిప్పలు పెట్టె జడ్డూ  బెస్ట్‌ 16 పరుగులకు అయిదు వికెట్లు. అలాగే ఐపీఎల్‌లో 120 మ్యాచ్‌లు ఆడిన బజ్జీ 150 వికెట్లు తీసి సత్తా చాటాడు. బజ్జీ బెస్ట్‌ 18 పరుగులకు అయిదు వికెట్లు. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే  క్రికెట్‌ ప్రపంచం అంతా ఐపీఎల్‌(IPL) కోసం ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తుందో ఐపీఎల్‌ టికెట్ల విక్రయమే చాటిచెప్పింది. ఐపీఎల్‌ టిక్కెట్లు హాట్‌ కేకుల్లా  అమ్ముడుపోయాయి. తొలి మ్యాచ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)అమితీమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం సోమవారం ఉదయం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయించారు. టిక్కెట్ల విక్రయ విండో ఓపెన్‌ చేయగానే క్షణాల్లో హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఒక వ్యక్తికి రెండు టిక్కెట్లు మాత్రమే విక్రయించారు. అయినా విక్రయం ప్రారంభమైన వెంటనే టికెట్లు అమ్ముడుపోయినట్టు నిర్వాహకులు వెల్లడించారు. రూ.7500, రూ.4500, రూ.4000, రూ.1700 టికెట్లన్నీ క్షణాల్లోనే అయిపోయాయి. 

 

మరిన్ని చూడండి



Source link

Related posts

Olympics 2036: ఒలింపిక్స్ కోసం సిద్ధమవుతున్న గుజరాత్.. 600 ఎకరాల్లో పనులు ప్రారంభం

Oknews

Dravid On Bharats Batting He S Had The Opportunity To Make Better Contributions

Oknews

టీ20 వరల్డ్ కప్ ఆడతానా లేదా తెలియదు.!

Oknews

Leave a Comment