Latest NewsTelangana

Hyderabad Drug Control Administration cancels licenses of two blood banks


Drug Control Administration revoked licenses of two blood banks: హైదరాబాద్: బ్లడ్ బ్యాంక్ పేరిట మోసాలకు పాల్పడుతున్న సంస్థలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కఠిన నిర్ణయం తీసుకుంది. శ్రీకర హస్పిటల్ బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషన్ సొసైటీ బ్లడ్ బ్యాంకుల లైసెన్స్ క్యాన్సిల్ చేసింది డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్. ఆ బ్లడ్ బ్యాంకులు నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్మా కలెక్ట్ చేస్తున్నాయి. మూసాపేట్ లోని హీమో సర్వీసెస్ నిర్వాహకులు ల్యాబరేటరీలో ఆక్రమంగా ప్లాస్మాని స్టోర్ చేసినట్లు గుర్తించారు. మియాపూర్ శ్రీకర్ బ్లడ్ బ్యాంక్, దారుల్షిఫాలోని న్యూలైవ్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఇక్కడికి ప్లాస్మా తీసుకొచ్చి… అక్రమంగా ప్లాస్మా అమ్ముతున్నట్లు గుర్తించారు. దాంతో ఈ రెండు బ్లడ్ బ్యాంక్‌ల లైసెన్సులు రద్దు చేస్తూ డ్రగ్ కంట్రోల్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్‌లో రక్తం, ప్లాస్లా దందా..
మనుషుల రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ లో అమ్ముతున్న బ్లడ్ ల బ్యాంక్ ల పర్మిషన్ రద్దు చేశారు. మియాపూర్ లోని శ్రీకర బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫా లోని న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ఈ సంస్థలు అనుమతులు లేకుండా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. రక్తం, ప్లాస్మా అక్రమంగా నిల్వ ఉంచి బ్లాక్ లో అమ్ముతున్న ముఠాను అధికారులు ఇదివరకే పట్టుకున్నారు. ముసాపేటలోని హీమో సర్వీస్ ల్యాబొరేటరీస్ కేంద్రంగా ప్లాస్మా నిల్వ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్ కంట్రోల్ అధికారులు ల్యాబ్ నిర్వాహకుడు రాఘవేంద్ర నాయక్ ను విచారించారు. శ్రీకర బ్లడ్ బ్యాంక్, న్యూ లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్లడ్ సెంటర్ లు హీమో ల్యాబ్ నుంచి బ్లాక్ లో ప్లాస్మా, రక్తం కొంటున్నాయని అధికారులు గుర్తించారు. 

 

మరిన్ని చూడండి



Source link

Related posts

టెట్ లో నార్మలైజేషన్ పై అభ్యర్థుల ఆందోళన, స్పెషల్ టెట్ కోసం సర్వీస్ టీచర్లు డిమాండ్!-hyderabad ts tet schedule released no clarity on normalization service teachers exam ,తెలంగాణ న్యూస్

Oknews

Megastar Chiranjeevi Support to Sundaram Master మరో చిన్న సినిమాకు చిరు సపోర్ట్

Oknews

కేబినెట్ విస్తరణ… నల్గొండకు మరో మంత్రి పదవి సాధ్యమేనా..?-will there be another chance in nalgonda district in telangana cabinet expansion ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment