Latest NewsTelangana

Hyderabad news 13 years old boy assaults three years old girl in Saroor nagar


Crime News: హైదరాబాద్ లో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల ఓ చిన్నారిపై 13 ఏళ్ల బాలుడు అత్యాచారం చేసిన ఘటన సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ కాలనీలో పక్క పక్క పోర్షన్లలో రెండు కుటుంబాలు అద్దెకు ఉంటున్నాయి. ఆదివారం సాయంత్రం ఓ కుటుంబానికి చెందిన చిన్నారి ఆ ఇంటి మేడపైన ఆడుకుంటోంది. అదే సమయంలో మరో కుటుంబానికి చెందిన బాలుడు వెళ్లి చిన్నారిపై అత్యాచారం చేసినట్లుగా సరూర్ నగర్ పోలీసులు తెలిపారు. 

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టడం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందుతుడు, బాధితురాలు మైనర్లు అయినందున కేసు వివరాలను పోలీసులు పూర్తిగా బహిర్గతం చేయలేదు. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఫిల్మ్ నగర్ లో విషాదం 
హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఆడుకుంటూ వెళ్లి చెరువులో మునిగి చనిపోయాడు. అతణ్ని పవన్ రాజ్ అని గుర్తించారు. మృతదేహం లభ్యం ‌కావడంతో అతని ఆచూకీ లభించింది. ఆదివారం (మార్చి 17) సాయంత్రం నుంచి గల్లంతైన యువకుడి కోసం NDRF బృందాలు గాలించగా.. సోమవారం అతని మృతదేహాన్ని గుర్తించారు. పవన్ రాజ్ మృతదేహాన్ని అతని ఇంటికి చేర్చడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

మరిన్ని చూడండి



Source link

Related posts

సమంత  అమెరికాలో అవి తింటుందా? 

Oknews

అల్లు అర్జున్ కి నిజంగానే ఆర్మీ ఉంది..అందుకే వరల్డ్ రికార్డు ఇచ్చారు

Oknews

3 Main Parties Arranged Meetings in Telangana on March 12 మార్చి12.. ఇంత హీటా..

Oknews

Leave a Comment