Sports

IND V ENG 3rd Test India Bowled Out For 445 By England On Day Two Of Third Test


IND – 445 all out: ఇంగ్లాండ్తో మూడో టెస్టులో టీం ఇండియా  తొలి ఇన్నింగ్స్లో 445 పరుగులకు ఆలౌటైంది.  కెప్టెన్ రోహిత్ శర్మ , రవీంద్ర జడేజా సెంచరీ హీరోలుగా నిలువగా తొలిసారి బరిలో దిగిన  బ్యాటర్లు సర్ఫరాజ్ ఖాన్ , ధ్రువ్ జురెల్కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఓవర్నైట్ 326/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. రవీంద్ర జడేజా  రెండు పరుగులు  మాత్రమేచేసి పెవిలియన్ బాట పట్టాడు. జో రూట్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు. దీంతో డెబ్యూ ప్లేయర్‌ ధ్రువ్‌ జరెల్‌తో కలిసి సీనియర్ ప్లేయర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టు స్కోరు ముందుకు తీసుకెళ్లాడు. ఎనిమిదో వికెట్కు వీరు 77 పరుగులు జోడించారు. కానీ స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ ఔట్ కావడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. చివర్లో బుమ్రా దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లోనే మూడు ఫోర్లు, సిక్స్ సాయంతో 26 పరుగులు చేశాడు. 

 5/0తో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్.. కారణం ఏంటంటే..

102వ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ బౌలర్‌ రెహన్‌ అహ్మద్‌ వేసిన బంతిని అశ్విన్‌ ఆఫ్‌-సైడ్‌లో ఆడాడు. సింగిల్‌ కోసం పరిగెడుతుండగా పిచ్‌ మధ్య భాగం “ప్రొటెక్టెడ్‌ ఏరియా”లోకి వెళ్లాడు.  వెంటనే గమనించి దూరంగా  వెళ్ళాడు. విషయం  గుర్తించిన అంపైర్‌ భారత జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులు విధిస్తున్నట్లు సిగ్నల్‌ ఇచ్చాడు. అంపైర్‌ నిర్ణయంతో ఫీల్డింగ్‌ జట్టు అయిన ఇంగ్లాండ్‌కు 5 పెనాల్టి పరుగులు లభిస్తాయి. అందువల్ల ఇంగ్లాండ్‌ తన ఇన్నింగ్స్‌ను 5/0తో మొదలు పెట్టింది.

తొలిరోజు మ్యాచ్ జరిగిందలా.. 

రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో తొలిరోజు 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా(Team India)ను రోహిత్ శర్మ- రవీంద్ర జడేజా(Rohit Sharma- Ravindra Jadeja) ఆదుకున్నారు. సెంచరీలతో దుమ్ములేపిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 204 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ-రవీంద్ర జడేజా జోడీ చరిత్ర సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇంగ్లండ్‌పై నాలుగో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా రికార్డు నెలకొల్పింది. 1985లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో నాలుగో వికెట్‌కు మహ్మద్ అజారుద్దీన్-మొహిందర్ అమర్నాథ్ నెలకొల్పిన 190 పరుగుల భాగస్వామ్యం రికార్డును రోహిత్‌ శర్మ-రవీంద్ర జడేజా బద్దలు కొట్టారు. టెస్టుల్లో స్వదేశంలో 1579 రోజుల తర్వాత టీమిండియా ఏ వికెట్‌కైనా 200కుపైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. అంటే నాలుగేళ్ల తర్వాత భారత జట్టుకు మళ్లీ 200కుపైగా పరుగుల భాగస్వామ్యం లభించింది. ఈ ఘనత సాధించిన జోడిగా రోహిత్-జడేజా నిలిచారు. స్వదేశం, విదేశాల్లో కలిపి ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ తరఫున నాలుగో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల జాబితాలో రోహిత్-జడేజా మూడో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ జోడి(249) పరుగులతో ముందు ఉంది.



Source link

Related posts

IND Vs AUS  Under 19 World Cup 2024 India Need 254 Runs To Win

Oknews

Pakistan selectors Mohammad Yusuf Abdul Razzaq will coach team in T20s against NZ

Oknews

PBKS vs SRH Match Highlights | PBKS vs SRH Match Highlights | రెండు పరుగుల తేడాతో పంజాబ్ పై SRH విజయం | IPL 2024

Oknews

Leave a Comment