IND vs ENG 2nd Test: వైజాగ్‌(Visakhapatnam) వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal) అద్భుత ఆటతీరుతో అపద్భాందువుడి పాత్ర పోషించాడు. అవతలి బ్యాటర్లు అర్థ శతకం చేసేందుకే కష్టాలు పడుతున్న వేళ… అజేయ శతకంతో టీమిండియాను భారీ స్కోరు దిశగా తీసుకెళ్లాడు. యశస్వి జైస్వాల్‌ భారీ శతకంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటం చేశాడు. 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్… 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. జైస్వాల్‌కు తోడుగా అశ్విన్‌ అయిదు పరుగులతో క్రీజులో ఉన్నాడు. యశస్వి మినహా మరే భారత బ్యాటర్‌ పెద్దగా రాణించలేదు. మిగిలిన భారత బ్యాటర్లలో ఏ ఒక్కరూ కనీసం అర్ధ శతకం కూడా సాధించలేక పోయారు.

మ్యాచ్‌ సాగిందిలా…
ట‌స్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ 40 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. డెబ్యూ క్యాప్ అందుకున్న స్పిన్నర్ బ‌షీర్ నాలుగో ఓవ‌ర్లోనే విధ్వంసకర ఆటగాడు రోహిత్‌ శర్మను ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేక్ ఇచ్చాడు. 14 పరుగులకే రోహిత్‌ అవుటయ్యాడు. గిల్(34), య‌శ‌స్వీ ధాటిగా ఆడి రెండో వికెట్‌కు 49 ర‌న్స్ జోడించారు. అండ‌ర్సన్ సూప‌ర్ డెలివ‌రీతో 89 ప‌రుగుల వ‌ద్ద గిల్‌ను బోల్తా కొట్టించాడు.

తొలిరోజు ఆటంతా జైస్వాల్‌దే…
టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ అరుదైన ఘనత సాధించాడు. అద్భుతమైన ఆట తీరుతో దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న జైస్వాల్‌… సొంతగడ్డపై తొలి శతకం నమోదు చేశాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 22 ఏళ్ల లెయశస్వి జైస్వాల్‌ అరుదైన జాబితాలో చోటు సంపాదించాడు. 23 ఏళ్ల వయసు కంటే ముందే విదేశీ, స్వదేశీ గడ్డపై టెస్టు సెంచరీ సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. యశస్వి కంటే ముందు రవిశాస్త్రి, సచిన్‌ టెండుల్కర్‌, వినోద్‌ కాంబ్లి ఈ ఘనత సాధించారు. యశస్వితో సహా వీళ్లంతా రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకే ఆడటం విశేషం. గమనార్హం. టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్… 17 ఫోర్లు, 5 సిక్సులతో 179 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో బషీర్‌ 2, అహ్మద్‌ 2, అండర్సన్‌ 1, హార్ట్‌లీ ఒక్క వికెట్‌ తీశారు.

Source link