హిట్‌మ్యాన్ రికార్డుల జోరు
రోహిత్ శర్మకు టెస్టుల్లో ఇది 12వ శతకం. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 48వ సెంచరీ. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్‌మ్యాన్ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. రూట్ 13 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా… మార్నస్ లబుషేన్ 11, కేన్ విలియమ్సన్ 10 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ తొమ్మిది శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ తర్వాత పాక్ స్టార్ బాబర్ ఆజం ఎనిమిది సెంచరీలతో అయిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌శర్మ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో 43 సెంచరీలతో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. ఓపెనర్లుగా వార్నర్(49), సచిన్(45) తర్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు. ఇంగ్లాండ్‌పై ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు బాదిన భారత క్రికెటర్‌గా సునీల్ గావస్కర్ సరసన రోహిత్ నిలిచాడు. వీరిద్దరూ నాలుగో సెంచరీలు చేశారు.
సిక్సర్ల రికార్డు కూడా
అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సులు కొట్టడంతో తనను మించిన మొనగాడు మరొకరు లేరని టీమిండియా సారధి రోహిత్‌శర్మ మరోసారి నిరూపించాడు. ఇప్పటికే సిక్సర్ల కింగ్‌లా పేరు గడించిన హిట్‌మ్యాన్ మరో అరుదైన రికార్డున తన పేరిట లిఖించుకున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా రోహిత్‌శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడంతో డబ్ల్యూటీసీలో 50 సిక్సర్ల మైలురాయిని రోహిత్ చేరుకున్నాడు. రోహిత్ తరువాతి స్థానంలో రిషబ్ పంత్ ఉన్నాడు. అతడు 38 సిక్సర్లు బాదాడు. ఓవరాల్‌గా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు అతడు 78 సిక్సర్లు కొట్టాడు. బెన్ స్టోక్స్ 78 సిక్సర్లతో టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో అగ్రస్థానంలో ఉండగా… 50 సిక్సర్లతో రోహిత్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 38 సిక్సర్లతో రిషబ్‌పంత్ తర్వాతి స్థానంలో…. 29 సిక్సర్లతో బెయిర్ స్టో నాలుగో స్థానంలో ఉన్నారు. 29 సిక్సర్లతో జైస్వాల్ అయిదు, 25 సిక్సర్లతో ట్రానిస్ హెడ్ ఆరో స్థానంలో ఉన్నారు.