Sports

IND vs ENG How has Virat Kohli performed in T20 World Cup knockout matches


IND vs ENG: ఆకలితో ఉన్న పులి వేటకు సిద్ధమైంది. పరుగుల ఆకలితో నకనకలాడుతున్న పులి.. బ్రిటీష్‌ బౌలర్లను వేటాడి… తన ఆకలి తీర్చుకునేందుకు సిద్ధమైంది. నాకౌట్‌ మ్యాచ్‌ అంటే చాలు…తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసే కింగ్‌ కోహ్లీ(Kohli) ఇప్పుడు మరోసారి ఆ అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. తాను మైదానంలో నిలబడితే ఎలా ఉంటుందో.. బౌండరీల మోత ఎలా మోగుతుందో చూపించేందుకు సమాయత్తమయ్యాడు. ఈ పొట్టి ప్రపంచకప్‌(T20 World Cup)లో ప్రతీ బ్యాటర్‌ ఏదో ఒక సమయంలో పరుగులు చేశారు. ఇక మిగిలింది మనందరికీ పరుగుల బాకీ పడింది విరాట్‌ కోహ్లీ ఒక్కడే. ఇక ఈ కీలక మ్యాచ్‌లో కోహ్లీ పరుగుల పరుగు అందుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది. గతంలో జరిగిన నాలుగు ఐసీసీ నాకౌట్‌ మ్యాచ్‌లలోనూ విరాట్… అర్ధ శతకాలతో మెరిశాడు. ఈసారి అలా మెరిసి ఆ మెరుపుల్లో బ్రిటీష్‌ బౌలర్లకు చుక్కలు కనపడితే చూడాలని ప్రతీ అభిమాని కోరుకుంటున్నాడు. 

సెమీస్‌ అంటనే విరాట్‌.. 
 పొట్టి  ప్రపంచకప్‌లలో సెమీఫైనల్‌ మ్యాచ్‌ అంటే విరాట్‌  తన విశ్వ రూపం చూపిస్తాడు.  అప్పటివరకూ ఒక ఎత్తు ఆ తరువాత మరో ఎత్తు అన్నట్టు కోహ్లీ  కాలర్ ఎగరేస్తాడు.   గత నాలుగు ప్రపంచకప్‌ సెమీస్‌లలో అర్ధ శతకాలు చేసి విరాట్‌ కోహ్లీ నాకౌట్‌ మ్యాచ్‌లలో తాను ఎంతటి విలువైన ఆటగాడినో ఇప్పటికే చెప్పేశాడు.  టీ 20 ప్రపంచకప్‌ 2014లో జరిగిన లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో  హాఫ్ సెంచరీతో అదరగొట్టిన  కోహ్లీ..  టీం ఇండియాకు  విజయాన్ని అందించాడు.  అప్పుడు కోహ్లీ  కేవలం 44 బంతుల్లోనే 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లోనూ కింగ్‌ 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో  భారత జట్టు 130 పరుగులు చేయగా దీనిని ఛేదించిన లంక టీ 20 ప్రపంచకప్‌ విజేతగా నిలిచింది. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్‌లోనూ  కింగ్‌ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ  89 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత జట్టు 196 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టార్గెట్‌ను విండీస్‌ చివరి ఓవర్‌లో ఛేదించి ఫైనల్‌కు చేరింది. ఇక గత ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీస్‌లోనూ విరాట్‌ అర్ధ శతకం చేసినా టీమిండియా ఓడింది. 

ఇక ఈ 2024 టీ 20 లో కోహ్లీ చెప్పుకొనేంతగా రాణించలేకపోయాడు.  100 స్ట్రైక్ రేట్‌తో ఇప్పటివరకు 5మ్యాచ్‌లలో 6 పరుగులు మాత్రమే చేశాడు. అంటేకాదు రెండుసార్లు గోల్డెన్ డెక్ అవుట్ అవ్వటంతో ఫాన్స్ నీరుత్సాహంలో ఉన్నారు. అయితే  సెమీస్ అంటే శివాలెత్తిపోయే కోహ్లీ  ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచ్ లో    విమర్శలకు  చెక్ పెడతాడని,   భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని నమ్ముతున్నారు. 

మరిన్ని చూడండి



Source link

Related posts

IPL 2024 CSK vs RCB tickets sold out instantly

Oknews

రాజస్థాన్ తో మ్యాచ్ కు ముందు రేంజ్ రోవర్ లో తిరుగుతున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

Oknews

SK vs GT IPL 2024 Shubman Gill wins toss Gujarat Titans to bowl first

Oknews

Leave a Comment