Sports

India Vs England 4th Test India Need 152 Runs


 India vs England 4th test: రాంచీ(Ranchi) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా(Team India).. విజయం దిశగా పయనిస్తోంది. ఇంగ్లాండ్‌(England) నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే దిశగా పయనిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 152 పరుగుల దూరంలో ఉంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 40 పరుగులు చేయగా.. క్రీజులో జైస్వాల్‌ 14*, రోహిత్‌ 24* ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ కైవసం చేసుకోనుంది.

జురెల్‌-కుల్‌దీప్‌ పోరాటం

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ధ్రువ్‌ జురెల్‌ అద్భుత పోరాటంతో టీమిండియా… గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఒంటరి పోరాటం చేసిన ధ్రువ్‌ జురెల్‌.. టెయిలండర్లతో కలిసి అద్భుతమే చేశాడు. ధ్రువ్‌ జురెల్‌ పోరాటంతో ఇంగ్లండ్‌కు 46 పరుగుల ఆధిక్యమే లభించింది. టీమిండియా అసలు 200 పరుగుల మార్క్‌ అయినా దాటుతుందా అన్న దశ నుంచి.. 300 పరుగుల మార్క్‌ దాటిందంటే అది కేవలం ధ్రువ్‌ ఒంటరి పోరాటం వల్లే ఓవర్‌ నైట్‌ స్కోరు ఏడు వికెట్ల నష్టానికి 219 పరుగులతో మూడో రోజు ఆట ఆరంభంచిన టీమిండియా… 307 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఇంగ్లండ్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. జురెల్‌ 90 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ 131 బంతులు ఎదుర్కొని 28 పరుగులు చేసి జురెల్‌కు మంచి సహకారం అందించాడు. చాలా ఓపిగ్గా అసలైన టెస్ట్‌ బ్యాటర్‌లా కనిపించిన కుల్‌దీప్‌ను… అండర్సన్‌ అవుట్‌ చేశాడు. 90 పరుగుల వద్ద జురెల్‌ అవుట్‌ కావడంతో టీమిండియా పోరాటం ముగిసింది. జురెల్‌ 90, యశస్వీ జైస్వాల్‌ 73, గిల్‌ 38,  కుల్‌దీప్‌ యాదవ్‌  28 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో బషీర్‌ 5, హార్ట్‌లీ 3, అండర్సన్‌ రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌ను ఎంత త్వరగా ఆలౌట్‌ చేస్తారన్న దానిపై టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

 

145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్‌

రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 145 పరుగులే ఆలౌట్‌ అయింది. టీమిండియా స్పిన్నర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్‌ వికెట్ల పతనం వేగంగా సాగింది. దీంతో టీమిండియా ముందు 192 పరుగుల లక్ష్యం నిలిచింది. టీమిండియా బౌలర్లలో అశ్విన్‌ 5 వికెట్లతో బ్యాటర్లను కట్టిపడేశాడు. కుల్‌దీప్ 4, జడేజా ఒక వికెట్‌ తీశారు. అన్ని వికెట్లు స్పిన్నర్లకే పడటం విశేషం. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో క్రాలే 60, బెయిర్‌ స్టో 30, మినహా అందరూ విఫలమయ్యారు. ఐదుగురు బ్యాటర్లు రెండంకెల స్కోరు చేయలేకపోయారు. భారత్‌ విజయానికి 192 పరుగులు చేయాలి.

 

అశ్విన్‌కు ఐదు వికెట్లు..

భారత స్పిన్నర్లు అదరగొట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 145 పరుగులకే ఆలౌట్ చేశారు. రవిచంద్రన్ అశ్విన్ (5/51), కుల్‌దీప్‌ యాదవ్ (4/22), రవీంద్ర జడేజా (1/56) వికెట్లు తీశారు. జాక్‌ క్రాలే (60) హాఫ్‌ సెంచరీ సాధించగా.. జానీ బెయిర్‌ స్టో (30), బెన్‌ ఫోక్స్ (17) కాస్త ఫర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 46 పరుగులతో కలిపి భారత్‌ ఎదుట ఇంగ్లాండ్‌ 192 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్‌లో పర్యటక జట్టు 353 పరుగులు చేయగా.. టీమ్‌ఇండియా 307 పరుగులకు ఆలౌటైంది.



Source link

Related posts

Dinesh Karthiks Hilarious Reaction On Virat Kohli vs Gautam Gambhir Ahead Of RCB vs KKR

Oknews

Irfan Pathan about MS Dhoni : Hyderabad టాలెంట్ హంట్ లో MSK Prasad, ఇర్ఫాన్ పఠాన్ | ABP Desam

Oknews

Shubman Gill likely to be named captain for Zimbabwe tour

Oknews

Leave a Comment