Sports

India Vs England 5th Test Rohit Sharma And Shubman Gill Dealing In Boundaries Finished Centuries


 Rohit Sharma and Shubman Gill  finished centuries :ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న చివరి టెస్ట్‌ రెండో రోజు ఆటలో టీమిండియా(Team India) సారధి రోహిత్‌ శర్మ(Rohit sharma), స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) శతకాలతో చెలరేగారు. రోహిత్‌ 140 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో శతకాన్ని అందుకోగా… దూకుడుగా ఆడిన గిల్‌ 10 ఫోర్లు, అయిదు సిక్సులతో వంద పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 135-1తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ భారీ స్కోర్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. కుర్ర ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(57) హాఫ్ సెంచ‌రీ బాదడంతో టీమిండియా ఇన్నింగ్స్ ప‌రుగులు పెట్టింది. అయితే.. ఫిఫ్టీ త‌ర్వాత బ‌షీర్ ఓవ‌ర్లో య‌శ‌స్వీ ఔటైనా.. రోహిత్, గిల్‌లు మ‌రో వికెట్ ప‌డ‌కుండా ఆడారు .

హిట్‌మ్యాన్‌ మరో సిక్సుల రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సులు కొట్టడంతో తనను మించిన మొనగాడు మరొకరు లేరని టీమిండియా సారధి రోహిత్‌శర్మ మరోసారి నిరూపించాడు. ఇప్పటికే సిక్సర్ల కింగ్‌లా పేరు గడించిన హిట్‌మ్యాన్‌ మరో అరుదైన రికార్డున తన పేరిట లిఖించుకున్నాడు.  ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రోహిత్‌శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ధ‌ర్మశాల వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టులో హిట్‌మ్యాన్‌ ఈ ఘనత సాధించాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడంతో డ‌బ్ల్యూటీసీలో 50 సిక్సర్ల మైలురాయిని రోహిత్‌ చేరుకున్నాడు. రోహిత్ త‌రువాతి స్థానంలో రిష‌బ్ పంత్ ఉన్నాడు. అత‌డు 38 సిక్సర్లు బాదాడు. ఓవ‌రాల్‌గా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు అత‌డు 78 సిక్సర్లు కొట్టాడు. బెన్ స్టోక్స్ 78 సిక్సర్లతో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో అగ్రస్థానంలో ఉండగా… 50 సిక్సర్లతో రోహిత్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 38 సిక్సర్లతో రిషబ్‌పంత్‌ తర్వాతి స్థానంలో…. 29 సిక్సర్లతో బెయిర్‌ స్టో నాలుగో స్థానంలో ఉన్నారు. 29 సిక్సర్లతో జైస్వాల్ అయిదు, 25 సిక్సర్లతో ట్రానిస్‌ హెడ్‌ ఆరో స్థానంలో ఉన్నారు. 

మరో రికార్డు ముంగిట
ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో మ‌రో మూడు సిక్సర్లు బాదితే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 600 సిక్సర్లు కొట్టిన మొద‌టి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. మూడు ఫార్మాట్లలో 471 మ్యాచ్‌లు ఆడిన శ‌ర్మ 594 సిక్సర్లు కొట్టాడు. మరో ఆరు సిక్సర్లు కొడితే ఆరు వందల సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్‌ నిలుస్తాడు. రోహిత్ శ‌ర్మను మ‌రో రికార్డు ఊరిస్తోంది. ధ‌ర్మశాల టెస్టులో హిట్‌మ్యాన్‌ క‌నీసం ఒక్క సిక్సర్ బాదినా అత‌డి ఖాతాలో మరో రికార్డు చేరుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ లో 50 సిక్సర్లు కొట్టిన మొద‌టి భార‌త ఆట‌గాడిగా రోహిత్‌ రికార్డుల‌కు ఎక్కనున్నాడు.

హెలికాఫ్టర్‌లో రోహిత్‌ గ్రాండ్‌ ఎంట్రీ
హిట్‌మ్యాన్‌ ప్రత్యేక ప్రైవేట్‌ హెలికాప్టర్‌లో ధర్మశాలలో అడుగుపెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. రోహిత్‌ హెలికాప్టర్‌లో ధర్మశాలకు వచ్చి జట్టుతో చేరాడు. గుజరాత్‌లో జరిగిన అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు హాజరైన రోహిత్‌ తర్వాత ప్రత్యేక ప్రైవేట్‌ హెలికాఫ్టర్‌లో ధర్మశాలకు చేరుకున్నాడు.



Source link

Related posts

Kohli Anushka Couple Dance Video Edited To Kurchi Madathapetti Song

Oknews

NZ Vs AFG World Cup 2023: New Zealand Beats Afghanistan By 149 Runs, AFG Allout For 139

Oknews

IPL 2024 LSG vs PBKS Lucknow Super Giants Sets 200 Runs Target

Oknews

Leave a Comment