Sports

India vs Zimbabwe1st T20I Preview Date time venue pitch captain Dream11 prediction


India vs Zimbabwe Preview: టీ 20 ప్రపంచకప్ (T20 World Cup)వేట అలా ఆరంభమైందో లేదో.. ఇక యువ భారత్‌ వేట ఆరంభం కానుంది. పొట్టి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుని ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న యువ టీమిండియా(India). పసికూన జింబాబ్వే(Zimbabwe)తో టీ 20 సిరీస్‌కు సిద్ధమైంది. టీమిండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్(Shubman Gill) సారథ్యంలో పూర్తిగా యువ ఆటగాళ్లే ఈ పర్యటనలో బరిలోకి దిగనున్నారు. రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వేళ… జింబాబ్వే సిరీస్‌లో విధ్వంసం సృష్టించి… జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని యువ ఆటగాళ్లు గట్టి పట్టుదలతో ఉన్నారు.

Image

ఇవాళ హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లో తొలి టీ 20 మ్యాచ్‌ జరగనుండగా… ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను ఆత్మ విశ్వాసంతో ప్రారంభించాలని భారత జట్టు…యువ భారత్‌కు షాక్ ఇవ్వాలని సికిందర్‌ రాజా సారథ్యంలోని జింబాబ్వే భావిస్తున్నాయి. అయితే జింబాబ్వేలో ఈ మ్యాచ్‌ జరగనుండడం… హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌లోని పిచ్‌పై జింబాబ్వే ఆటగాళ్లకు అవగాహన ఉండడంతో ఈ మ్యాచ్‌… ఉత్కంఠభరితంగా సాగే అవకాశం ఉంది. జింబాబ్వే సారధి సికిందర్‌ రజా ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. అదే ఫామ్‌ కొనసాగితే యువ భారత్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసుకునేందుకు జింబాబ్వే సారధి రజాకు కేవలం 53 పరుగుల దూరంలో ఉన్నాడు. 14 ఏళ్ల వ్యవధిలో జింబాబ్వే-భారత్‌  కేవలం ఎనిమిది టీ20ల్లో మాత్రమే తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఆరు మ్యాచుల్లో గెలవగా… జింబాబ్వే రెండుసార్లు భారత్‌కు షాక్ ఇచ్చింది.  

Image

భవిష్యత్తు నిర్మించుకునే దిశగా…

T 20 ప్రపంచకప్ గెలిచి ఓ వైపు టీమిండియా చరిత్ర సృష్టించగా… మరోవైపు భవిష్యత్తు నిర్మాణం దిశగా టీమిండియా నడుస్తోంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్న పదిహేను మంది యువ ఆటగాళ్లకు… భారత భవిష్యత్తుపై నమ్మకం కలిగించే సువర్ణ అవకాశం దక్కింది. శుభ్‌మన్‌ గిల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్… జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్న పట్టుదలో ఉన్నారు. టీ 20 ప్రపంచకప్‌లో రిజర్వ్‌గా ఉన్న రింకూ సింగ్ ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో బరిలోకి దిగనున్నాడు. ఈ సిరీస్‌లో మరోసారి విధ్వంసం సృష్టించాలని రింకూ గట్టి పట్టుదలతో ఉన్నాడు. రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్ వంటి ఆటగాళ్లు కూడా ఈ సిరీస్‌లో రాణించి భవిష్యత్తులో జట్టులో స్థానం సుస్ధిరం చేసుకోవాలని చూస్తున్నారు. 

Image

 

భారత జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధృవ్ జురెల్/జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్,  తుషార్ దేశ్‌పాండే,  ఖలీల్ అహ్మద్ 

Image

 

జింబాబ్వే జట్టు: బ్రియాన్ బెన్నెట్, తాడివానాషే మారుమణి, సికందర్ రజా (కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, అంటుమ్ నఖ్వీ, క్లైవ్ మదాండే, వెస్లీ మాధేవెరే, ల్యూక్ జోంగ్వే, ఫరాజ్ వెల్‌లింగ్టన్, దీవెన ముజారబానీ

మరిన్ని చూడండి



Source link

Related posts

King Virat Kohli RCB Unbox Event: అంత పెద్ద ఈవెంట్ లో స్టేజ్ పైనే ఇబ్బంది వ్యక్తం చేసిన కోహ్లీ..!

Oknews

ఏషియన్ గేమ్స్ లో రజతం సాధించిన టెన్నిస్ ప్లేయర్ సాకేత్ కు సన్మానం

Oknews

Trent Boult bowled 2 overs |RR vs GT Match Highlights | Trent Boult bowled 2 overs |RR vs GT Match Highlights | సంజూ ఏం చేశావో అర్థమవుతోందా..?

Oknews

Leave a Comment