Indian Cricket Team With PM Modi: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి… విశ్వ విజేతలుగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లు, కుటుంబ సభ్యులతో కలిసిన దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఇవాళ ఉదయం బార్బడోస్ నుంచి ఢిల్లీకి చేరిన భారత ఆటగాళ్లు… ప్రధానమంత్రి అధికారిక నివాసంలో మోదీని కలిసి కాసేపు ముచ్చటించారు. టీ 20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ఎంత భావోద్వేగానికి గురయ్యామో… ఆటగాళ్లు మోదీకి వివరించారు. పొట్టి ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతీ ఆటగాడు తమ అనుభవాలను మోదీకి వివరించారు. టీమిండియా సారధి రోహిత్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్‌లతో జోకులు వేస్తూ ప్రధాని మనస్ఫూర్తిగా నవ్వుతున్న దృశ్యాలు అభిమానుల మనసులు దోచుకున్నాయి.
VIDEO | T20 World Cup-winning Indian cricket team met PM Modi at his residence earlier today.
(Source: Third Party) pic.twitter.com/MuNhVmNroD
— Press Trust of India (@PTI_News) July 4, 2024
అందరితో ఫొటోలు
టీమిండియా గెలిచిన ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయ సిబ్బందితోనూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులతోనూ మోదీ ఫొటోలు దిగారు. అనంతరం భారత క్రికెటర్లందరితో ముచ్చటించిన ప్రధాని వారితో సరదగా గడిపారు. మొత్తం టీమ్‌తో పాటు టీ20 ప్రపంచకప్ ట్రోఫీతోనూ మోదీ ఫోటో దిగారు. 2023 నవంబర్ 19న వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయిన అనంతరం మోదీ… భారత జట్టును కలిశారు. అప్పుడు నిస్తేజంగా… నిసత్తువంగా ఆటగాళ్లు ఉన్నారు. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు పూర్తి భిన్నమైన వాతావరణం ఉంది. అప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిని ఉత్సాహపరిచేందుకు ప్రధాని మోదీ చేతులు పట్టుకుని ధైర్యం చెప్పాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆటగాళ్లు పూర్తి సంతోషంగా మోదీతో కలిసి టీ 20 ప్రపంచకప్ సాధించిన మధుర క్షణాలను పంచుకున్నారు. ఛాంపియన్స్ అని రాసి ఉన్న ప్రత్యేక జెర్సీలను ధరించిన టీమిండియా ఆటగాళ్లు… ప్రధానమంత్రి చుట్టూ కూర్చున్న ఆటగాళ్లు… తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రధాని మోదీకి కుడివైపు కెప్టెన్ రోహిత్ శర్మ ఉండగా, ఎడమవైపు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. భారత క్రికెటర్లందరితో మనస్ఫూర్తిగా మాట్లాడిన మోదీ సరద వ్యాఖ్యలు చేస్తూ అందరినీ నవ్వించారు. అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా, బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్ని ప్రధాని మోదీ… నమో వన్ అని రాసి ఉన్న జెర్సీని ప్రత్యేకంగా బహూకరించారు. ఛాంపియన్లతో సమావేశం అద్భుతంగా సాగిందని… ప్రపంచ కప్ విజేత జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం గొప్పగా ఉందని టీమిండియాతో బేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. టోర్నమెంట్లో అనుభవాలపై చిరస్మరణీయమైన సంభాషణ జరిగిందని ప్రధాని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
BCCI Secretary Jay Shah and President Roger Binny presented the ‘Namo 1’ jersey to Prime Minister Narendra Modi.
Indian Cricket Team met with PM Narendra Modi, at his official residence today.
(Picture Source- BCCI) pic.twitter.com/iSHZdVAeiu
— ANI (@ANI) July 4, 2024
హోటల్లోనూ సంబరాలు..
టీ 20 ప్రపంచకప్ గెలిచి ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన భారత ఆటగాళ్లు అక్కడి నుంచి సరాసరి చాణక్యపురిలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. హోటల్లో ప్రత్యేక కేక్‌ను సిద్ధం చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ ప్రధాని నరేంద్ర మోజీ కలవడానికి బయలుదేరే ముందు కట్ చేశారు. అనంతరం హోటల్లో భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి అందించారు. చాక్లెట్‌తో తయారు చేసిన ట్రోఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విరాట్ కోహ్లికి చోలే భాతురే, రోహిత్ శర్మకు వడా పావ్ అందించారు. ట్రఫుల్స్, చాక్లెట్స్ కూడా ఇచ్చారు. మిల్లెట్లతో తయారు చేసిన అల్పహారాన్ని కూడా భారత ఆటగాళ్లకు అందించారు. చాక్లెట్ బంతులు, బ్యాట్లు, వికెట్లు, పిచ్‌లను పోలిన కేకులను కూడా సిద్ధం చేశారు. ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మరిన్ని చూడండి