భారత్‌ను ఛాంపియన్‌గా నిలవడంలో ముంబైకర్లు కీలక పాత్ర పోషించారంటూ నీతా అంబానీ అన్నారు. టీమిండియా విశ్వ విజేతలుగా నిలవడంలో సారధి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ సంగీత్‌లో రోహిత్ శర్మ, హార్దిక్, సూర్యకుమార్‌లను ఘనంగా సత్కరించారు.
#WATCH | During the Sangeet celebrations of Anant Ambani and Radhika Merchant, Chairperson of Reliance Foundation Nita Ambani called Team India captain Rohit Sharma and cricketers Suryakumar Yadav, Hardik Pandya on stage and the whole gathering applauded the World Cup winning… pic.twitter.com/s6ITvK2t46
— ANI (@ANI) July 6, 2024
సంగీత్ వేడుకలో కంటతడి
ముంబై ఇండియన్స్ యజమాని.. రిలయన్స్ ఇండస్ట్రీస్ సహ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ… తన కుమారుడు అనంత్ అంబానీ సంగీత్ వేడుకలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. పొట్టి ప్రపంచకప్ గెలిచిన సభ్యులు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా సహా టీమిండియా సాధించిన ఘనతకు నీతా అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ మనమందరం కుటుంబసభ్యులమని… కానీ తనకు మరో కుటుంబం ఉందని స్టేజిపై నీతా అంబానీ మాట్లాడారు. ఆ మరో కుటుంబం ఇవాళ దేశాన్ని గర్వపడేలా చేసిందని… ప్రతి ఒక్కరి హృదయం గర్వంతో ఉప్పొంగేలా చేసిందని.. వారి వల్లే ప్రారంభమైన ఈ వేడుకల ఇప్పట్లో ఆగవని నీతా అన్నారు. ఈ విజయం తనకు గొప్ప అనుభూతినో పంచిందో చెప్పలేనని నీతా అంబానీ అన్నారు.
ఇవాళ ముంబై ఇండియన్స్ కుటుంబం మాతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు అమితానాందాన్ని ఇస్తోందని నీతా అంబానీ అన్నారు. 2011 తర్వాత తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీని భారత్‌కు తీసుకొచ్చినందుకు ముకేశ్ అంబానీ కూడా అభినందించారు. సంగీత్ వేడుకకు హాజరైన వారు లేచి నిలబడి, ప్రపంచ కప్ గెలిచిన హీరోలకు గౌరవాన్ని ఇచ్చారు. ఈ సంగీత్ వేడుకలో మాజీ కెప్టెన్ ధోని, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కృనాల్ పాండ్యా కూడా పాల్గొన్నారు.
ముగ్గురు ముగ్గరే
టీ 20 ప్రపంచకప్‌లో రోహిత్ 257 పరుగులతో టోర్నమెంట్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ చివరి ఓవర్లో అద్బుత క్యాచ్‌తో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌ను మరికొంతకాలం మనం మర్చిపోలేం.
మరిన్ని చూడండి