Nirmala Sitharaman’s interim Budget speech: ఆర్థిక మంత్రి(Finance Minister) నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) మధ్యంతర బడ్జెట్( interim Budget) ప్రవేశపెట్టారు. ఈ ప్రసంగంలో 18 ఏళ్ల భారత చెస్ దిగ్గజం రమేష్‌బాబు ప్రజ్ఞానంద ప్రస్తావన చేశారు. క్రీడా రంగంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావించారు. గత ఏడాది ఆసియా క్రీడలు మరియు ఆసియా పారా గేమ్స్‌లో భారతదేశం అత్యధిక పతకాలను సాధించిందని, ఇది దేశం యొక్క అధిక విశ్వాస స్థాయిని ప్రతిబింబిస్తుందని అన్నారు.ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్‌సెన్‌కు గట్టి పోటీ ఇచ్చిన పిల్లాడిగా ప్రజ్ఞానంద పేరు ప్రస్తావించారు. 2010లో కేవలం 20 మంది చెస్ గ్రాండ్‌మాస్టర్‌లు ఉండగా, ఇప్పుడు భారత్‌లో 80 మంది చెస్ గ్రాండ్‌మాస్టర్లు ఉన్నారని సీతారామన్ పేర్కొన్నారు.
ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం..
ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద 2748.3 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12 స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో భారత్ తరఫున టాప్ ప్లేయర్‌గా ఈ యువ గ్రాండ్‌మాస్టర్ అగ్రస్థానంలోకి ఎగబాకాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత.. క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో భారతీయుడిగా నిలిచాడు. ప్రధానితో ప్రశంసలు పొందాడు. ప్రజ్ఞానందకు ఆర్థికంగా అండగా ఉంటామని అదానీ గ్రూప్ ప్రకటించింది. గతేడాది జరిగిన చెస్ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద కొద్దిలో టైటిల్ కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినా ఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిచ్చి అందరి మనసులు గెల్చుకున్నాడు. 5 సంవత్సరాల వయస్సులో ఆడటం ప్రారంభించిన ప్రజ్ఞానంద.. 2018లో 12 సంవత్సరాల వయస్సులో భారతదేశపు అతి పిన్న వయస్కుడిగా, ప్రపంచంలోని రెండో అతి పిన్న వయస్కుడైన గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు. అభిమన్యు మిశ్రా, సెర్గీ కర్జాకిన్, గుకేష్ డి, జావోఖిర్ సిందరోవ్ తర్వాత గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఐదో పిన్న వయస్కుడిగా నిలిచాడు. ప్రజ్ఞానంద సోదరి వైశాలి కూడా గ్రాండ్‌మాస్టరే. ఆమె భారతదేశంలో గ్రాండ్‌మాస్టర్‌గా మారిన మూడవ మహిళా చెస్ క్రీడాకారిణిగా రికార్డ్ సాధించారు. వీరిద్దరూ ప్రపంచంలోనే మొట్టమొదటి సోదర, సోదరీ గ్రాండ్ మాస్టర్ జంటగా చరిత్ర సృష్టించారు.
ప్రజ్ఞానంద 2013లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ అండర్-8 టైటిల్‌ను గెలుచుకున్నాడు. దీంతో ఎఫ్ఐడీఈ మాస్టర్ బిరుదు అందుకున్నాడు. 2015లో అండర్-10 టైటిల్‌ను గెలుచుకున్నాడు. 2016లో, ప్రజ్ఞానానంద 10 సంవత్సరాల, 10 నెలల 19 రోజుల వయస్సులో చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచాడు.
మరిన్ని చూడండి